Menu Close
Lalitha-Sahasranamam-PR page title

అష్టాదశోధ్యాయం

(అమ్మవారి సమగ్ర రూపం వర్ణన, ఫలశృతి)

శ్లోకాలు: 167/2-183, సహస్రనామాలు: 901-1000

971. ఓం సువాసిన్యర్చనప్రీతాయై నమః
సువాసినులు చేయు పూజకు ఆనందపడునట్టి తల్లికి వందనాలు.


972. ఓం శోభనాయై నమః
శోభానాకారం కల సౌందర్యరాశియైన లలితా మాతకు వందనాలు.


973. ఓం శుద్ధమానసాయై నమః
విశుద్ధాంతరంగం కల శుద్ధ మనస్వినికి ప్రణామాలు.


974. ఓం బిందుతర్పణసంతుష్టాయై నమః
బిందుశబ్దానికి గల అర్ధాలలో జ్ఞానమని కూడా ఉంది, అట్టి జ్ఞానులు చేయునట్టి తర్పణాదులకు సంతుష్టి చెందునట్టి దేవికి వందనాలు.


975. ఓం పూర్వజాయై నమః
సర్వులకూ ఆదిలో అవతరించి తేజరిల్లునట్టి ఆదిశక్తి స్వరూపిణికి వందనాలు.


976. ఓం త్రిపురాంబికాయై నమః
త్రిపురసుందరీ మాతకు నమస్కారాలు.


977. ఓం దశముద్రా సమారాధ్యాయై నమః
దశముద్రలు ప్రదర్శించి తద్వారా చక్కగా ఆరాధించదగినట్టి మాతకు ప్రణామాలు.


978. ఓం త్రిపురాశ్రీ వశంకర్యై నమః
త్రిపురాశ్రీ దేవతను వశము చేసికొన్నట్టి, భక్తులకు వశము,చేయునట్టి వశంకర మూర్తికి వందనాలు.


979. ఓం జ్ఞానముద్రాయై నమః
తర్జనీ అంగుష్టాలు రెంటినీకలిపి ఉంచుటయే జ్ఞానముద్ర. అట్టి ముద్రకలిగిన మాతకు నమస్కారాలు.


980. ఓం జ్ఞాన గమ్యాయై నమః
జ్ఞానంవల్ల పొందదగిన తల్లికి వందనాలు.


981. ఓం జ్ఞానజ్ఞేయ స్వరూపిణ్యై నమః
జ్ఞాన- జ్ఞేయాలేదృక్ దృశ్యాలే స్వరూపంగా గల మాతకు వందనాలు.


982. ఓం యోనిముద్రాయై నమః
యోని ముద్రలో భాసిల్లు మాతకు వందనాలు.


983. ఓం త్రిఖండేశ్యై నమః
సోమసూర్యాగ్ని మంత్రఖండాలకు త్రిఖండా అని పేరు. వాటికి అధీశ్వరీయై తేజరిల్లు మాతకు ప్రణామాలు.


984. ఓం త్రిగుణాయై నమః
మూడు గుణాలు కల-- త్రిగుణ స్వరూపిణికి నమస్కారాలు.


985. ఓం అంబాయై నమః
చరాచర మైన అఖిలాండకోటి బ్రహ్మాండాలకూ తల్లి అయిన అంబా స్వరూపిణికి వందనాలు.


986. ఓం త్రికోణగాయై నమః
మూలప్రకృతి రూపిణియై త్రికోణంలో భాసిల్లు మాతకు వందనాలు.


987. ఓం అనఘాయై నమః
పాపరహితకు వందనాలు.


988. ఓం అద్భుత చారిత్రాయై నమః
ఆశ్చర్యకరమైన పరమపావన చరిత్రగల మాతకు వందనాలు.


989. ఓం వాంఛితార్థ ప్రదాయిన్యై నమః
తనను సేవించువారి ఆరాధించువారి కోర్కెలను నెరవేర్చునట్టి మాతకు నమస్కారాలు.


990. ఓం అభ్యాసాతిశయ జ్ఞాతాయై నమః
అతిశయాభ్యాసం ద్వారా తెలిసికోదగిన దేవతకు వందనాలు.


991. ఓం షడధ్వాతీతరూపిణ్యై నమః
వర్ణ, పద, మంత్రి, భువన, తత్వ, కళాధ్వలు. ఈ ఆరీంటినీ షడధ్వలనబడతాయి. ఈ షట్కాతీత స్వరూపిణియై తేజరిల్లు మాతకు వందనాలు.


992. ఓం అవ్యాజకరుణామూర్త్యై నమః
హేతువు లేకుండగనే దయచూపునట్టి కరుణామయికి నమస్కారాలు.


993. ఓం అజ్ఞానధ్వాంతదీపికాయై నమః
అజ్ఞాన రూపాంధకారాన్ని రూపుమాపునట్టి జ్ఞానజ్యోతి స్వరూపిణికి ప్రణామాలు.


994. ఓం ఆబాలగోపాల విదితాయై నమః
సర్వులూ తెలుసుకోదగిన మాతకు వందనాలు.


995. ఓం సర్వానుల్లంఘ్య శాసనాయై నమః
ఎవ్వరూ, ఎట్టివారైనాసరే, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులయినా సరే ఉల్లంఘించుటకు వీలులేనట్టి శాసనాన్ని చేయునట్టి మాతకు వందనాలు.


996. ఓం శ్రీచక్రరాజ నిలయాయై నమః
శివ--శక్తులకు నిలయస్థానమైనది శ్రీచక్రరాజము. అట్టి మహత్తరమైన శ్రీ చక్రరాజమే ఆవాసస్థానంగా గల మాతకు వందనాలు.


997. ఓం శ్రీమత్త్రిపురసుందర్యై నమః
త్రిపురాలలో అతిశయం సౌందర్యంతో రాజిల్లునట్టి త్రిపురసుందరీ మాతకు వందనాలు.


998. ఓం శ్రీ శివాయై నమః
శివా స్వరూపిణికి వందనాలు.


999. ఓం శివశక్త్యైక స్వరూపిణ్యై నమః
శివశక్తి స్వరూపిణి అంటే అర్థనారీశ్వర మూర్తికి ప్రణామాలు.


1000. ఓం లలితాంబికాయై నమః
లలితమైన అంబా స్వరూపిణికి-- లాలిత్యమూర్తికి--శ్రీ లలితాంబికకు వందనాలు.

* * * అష్టదశోధ్యాయం సమాప్తం * * *

...సర్వం శ్రీలలితా పరదేవతార్పణమస్తు...

Posted in December 2024, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!