Menu Close
Lalitha-Sahasranamam-PR page title

సప్తదశోధ్యాయం

(అమ్మవారి ఆద్యరూపం వర్ణన)

శ్లోకాలు: 152/2-167/1, సహస్రనామాలు: 801-900

880. ఓం సంసారపంక నిర్మగ్న సముద్ధరణ పండితాయై నమః
బురదలో పడి చిక్కుకుపోయిన భక్తులను సముద్ధరించగల కరుణామ తల్లికి ప్రణామాలు.


881. ఓం యజ్ఞప్రియాయై నమః
యాగములందు ప్రీతి గల మాతకు వందనాలు.


882. ఓం యజ్ఞకర్త్రై నమః
యాగములను చేయించునట్టి తల్లికి వందనాలు.


883. ఓం యజమాన స్వరూపిణ్యై నమః
యజమాని స్వరూపిణికి నమస్కారాలు.


884. ఓం ధర్మాధారాయై నమః
ధర్మానికి ఆధారభూతురాలైన జననికి వందనాలు.


885. ఓం ధనాధ్యక్షాయై నమః
ధనాధ్యక్షుడైన కుబేర స్వరూపముగల మాతకు నమస్కారాలు.


886. ఓం ధనధాన్యవివర్ధిన్యై నమః
ధనధాన్యములను వర్ధిల్లజేయునట్టి మాతకు ప్రణామాలు.


887. ఓం‌ విప్రప్రియాయై నమః
వేదశాస్త్రవేత్తలై, సదాచార సంపన్నులైన, భక్తులైన విప్రులయందు ప్రేమభావం-- అనుగ్రహ భావం కల మాతకు నమస్కారాలు.


888. ఓం విప్రరూపాయ నమః
విప్రస్వరూపిణికి నమస్కారాలు.


889. ఓం విశ్వభ్రమణ కారిణ్యై నమః
విశ్వభ్రమణానికి కారణమూర్తి అయిన దేవికి వందనాలు.


890. ఓం విశ్వగ్రాసాయై నమః
యావద్విశ్వాన్నీ గ్రాసంచేసికొనునట్టి, కబళించునట్టి శక్తికి వందనాలు.


891. ఓం విద్రుమాభాయై నమః
పగడంవలె ఎఱ్ఱని కాంతులతో తేజరిల్లు మాతకు నమస్కారాలు.


892. ఓం వైష్ణవ్యై నమః
వైష్ణవీ శక్తి కి వందనాలు.


893. ఓం విష్ణురూపిణ్యై నమః
విష్ణుస్వరూపాన్ని కూడా ధరించిన మాతకు ప్రణామాలు.


894. ఓం అయోన్యై నమః
యోనిరహితురాలగు శక్తికి వందనాలు.


895. ఓంయోనినిలయాయై నమః
శ్రీ చక్రంలోని త్రికోణాంతర్గత బిందు స్థానమే నిలయంగాగల మాతకు వందనాలు.


896. ఓం కూటస్థాయై నమః
కూటశబ్దానికి-- అజ్ఞానార్ధమున్నది. అట్టి అజ్ఞానానికి స్థానంగాగల మాతకు వందనాలు.


897. ఓం కులరూపిణ్యై నమః
బాహ్యపూజ--లేక వంశాచారాందులకు కులమని పేరు. అట్టి కులస్వరూపిణికి వందనాలు.


898. ఓం వీరగోష్ఠీప్రియాయై నమః
వీరులకు సంబంధించిన గోష్ఠులయందు అభిరుచి గల అంబకు వందనాలు.


899. ఓం వీరాయై నమః
వీరమూర్తికి నమస్కారాలు.


900. ఓం నైష్కర్మ్యాయై నమః
కర్మరహితకు వందనాలు.


* * * సప్తదశోధ్యాయం సమాప్తం * * *


అష్టాదశోధ్యాయం

(అమ్మవారి సమగ్ర రూపం వర్ణన, ఫలశృతి)

శ్లోకాలు: 167/2-183, సహస్రనామాలు: 901-1000

901. ఓం నాదరూపిణ్యై నమః
‘నాద’ స్వరూపిణికి నమోవాకాలు.


902. ఓం విజ్ఞాన కలనాయై నమః
విద్యలయందు విశేషాదరణ కల మాతకు వందనాలు.


903. ఓం కల్యాయై నమః
సృజనశక్తి స్వరూపిణికి ప్రణామాలు.


904. ఓం విదగ్ధాయై నమః
చాతుర్యమూర్తి కి వందనాలు.


905. ఓం బైందవాసనాయై నమః
బిందువే ఆసనంగా గల మాతకు ప్రణామాలు.


906. ఓం తత్త్వాధికాయై నమః
సర్వతత్త్వాల కన్న అతీతురాలగు మాతకు ప్రణామాలు.


907. ఓం తత్త్వమయ్యై నమః
తత్త్వమయమూర్తికి వందనాలు.


908. ఓం తత్త్వమర్థ స్వరూపిణ్యై నమః
తత్త్వమర్థ స్వరూపిణికి వందనాలు.

***** సశేషం *****

Posted in September 2024, ఆధ్యాత్మికము

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!