సప్తదశోధ్యాయం
(అమ్మవారి ఆద్యరూపం వర్ణన)
శ్లోకాలు: 152/2-167/1, సహస్రనామాలు: 801-900
851. ఓం జన్మమృత్యు జరాతప్త జన విశ్రాంతిదాయిన్యై నమః
భక్తులకు జననం మరణాలు, ముసలితనం మొదలైన వాటిచేత కలిగే దుఃఖాలను తొలగించి, ఆత్మ సుఖాన్ని ప్రసాదించు తల్లికి నమస్కారము.
852. ఓం సర్వోపనిషదుద్ఘుష్టాయై నమః
సర్వ ఉపనిషత్తులచే ప్రతిపాదించబడిన తల్లికి నమస్కారము.
853. ఓం శాంత్యతీత కళాత్మికాయై నమః
శాంతికి అతీతమైన(ద్వైతబుద్ధిని తొలగించి ఆనందానిచ్చే) తల్లికి నమస్కారము.
854. ఓం గంభీరాయై నమః
అనంతమైనది కనుక గంభీరంగా (నిగూఢమైనదై, తెలిసికొనుటకు శక్యం కానిదై) వుండు తల్లికి నమస్కారము.
855. ఓం గగనాంతస్థాయై నమః
ఆకాశమునంతటనూ వ్యాపించి ఉన్న తల్లికి నమస్కారము.
దహరాకాశము (హృదయమందు వుండునది), భూతాకాశము (కంటికి కనిపించేది), ప్రాకారము ( పై వాటికి అతీతంగా ఉండునది) వీటన్నింటి యందూ జగన్మాతయే వ్యాపించి విరాజిల్లుతోంది.
856. ఓం గర్వితాయై నమః
గర్వితురాలైన తల్లికి నమస్కారము. ప్రేమ శివునిలో ' నేను' అనే భావన విశ్వ నిర్మాణానికి కారణమైన క్రియాశక్తి గా వున్న తల్లి ' గర్విత' అయినది.
857. ఓం గానలోలుపాయై నమః
సర్వ విధములైన గానములందు ప్రీతి గల తల్లికి నమస్కారము.
858. ఓం కల్పనా రహితాయై నమః
వికల్పరహిత అయిన ( సర్వకాలములందు ఏకాకారముగా వుండు) తల్లికి నమస్కారము. నామరూపములతో కూడినదంతా కోల్పోయే (మిథ్యయే) కాని, జగన్మాత కల్పనకు అతీతమైన పరబ్రహ్మ స్వరూపిణి.
859. ఓం కాష్టాయై నమః
ఎవరు లక్ష్యమని, గమ్యమని ఉపనిషత్తులు నిశ్చితముగా చెబుతున్నాయో, అట్టి తల్లికి నమస్కారము
860. ఓం అకాంతాయై నమః
అకమును (పాపాన్ని) రూపుమాపు చేయు తల్లికి నమస్కారము.
861. ఓం కాంతార్ధాయై విగ్రహాయై నమః
కాంతుడైన శివుని అర్ధం శరీరాన్ని పొందిన తల్లికి నమస్కారము.
862. ఓం కార్యకారణ నిర్ముక్తాయై నమః
కార్యము మరియు, కారణములన్నింటిచే విడువనివున్న తల్లికి నమస్కారము. కారణం మూల ప్రకృతి, కార్యములు మహత్తు, అహంకారాదులు...పరతత్త్వం (శుద్ధ చైతన్యం). కాబట్టి శుద్ధ చైతన్య స్వరూపిణి అయిన లలితాంబికకు కార్య, కారణం సంబంధం లేదు.
863. ఓం కామకేళి తరంగితాయై నమః
కామేశ్వరుని క్రీడా విలాసాలు (సృష్టి, స్థితి, లయముల) పరంపరలు గల తల్లికి నమస్కారము.
864. ఓం కనత్కనక తాటంకాయై నమః
బంగారు కర్ణాభరణాలు గల తల్లికి నమస్కారము. ( జగన్మాత సౌభాగ్యాలను ప్రసాదించునని భావం).
865. ఓం లీలా విగ్రహధారిణ్యై నమః
లీలను (సృష్టి, స్ధితిక, లయలనే క్రీడను) కొనసాగించడానికి పెక్కు అవతారాలు ధరించు తల్లికి నమస్కారము.
866. ఓం అజాయై నమః
పుట్టుక లేనిదైన తల్లికి నమస్కారము.
867. ఓం క్షయవినిర్ముక్తాయై నమః
పుట్టుక లేనందున క్షయం ( పాశం) కూడా లేని తల్లికి నమస్కారము.
868. ఓం ముగ్ధాయై నమః
ప్రసన్న చిత్తముతో కూడిన సౌందర్యం గల తల్లికి నమస్కారము.
869. ఓం క్షిప్ర ప్రసాదిన్యై నమః
భక్తులను శ్రీఘ్రంగా అనుగ్రహించు తల్లికి నమస్కారము.
870. ఓం అంతర్ముఖ సమారాధ్యాయై నమః
అంతర్ముఖులైన (ఆత్మ పట్ల చిత్తమును మరలించిన) వారిచే విశేషం గా ఆరాధింపబడు తల్లికి నమస్కారము.
871. ఓం బహిర్ముఖసుదుర్లభాయై నమః
బహిర్ముఖులైన (లౌకిక విషయాలపై దృష్టి నిమగ్నం చేసిన) వారికి సాక్షాత్కారం లభించడం దుర్లభమైన తల్లికి నమస్కారము.
872. ఓం త్రయ్యై నమః
వేదత్రయ (ఋగ్యజుస్సామ వేదాల) రూపం గల తల్లికి నమస్కారము
873. ఓం త్రివర్గ నిలయాయై నమః
ధర్మార్థకామాలనే త్రివర్గాలకూ నిలయస్థాన స్వరూపిణి అయిన మాతకు వందనాలు.
874. ఓం త్రిస్థాయై నమః
లోకాలు, దేవతలు, విద్యలు, అగ్నులు, జ్యోతిస్సులు, వర్గాలు, ధర్మాలు, గుణాలు, --యీవిధంగా త్రయాలన్నియు గల దేవికి వందనాలు.
875. త్రిపుర మాలిన్యై నమః
త్రిపుర మాలిని నామక దేవతా స్వరూపిణికి నమస్కారాలు.
876. నిరామయాయై నమః
నిరామయమూర్తికి నమోవాకాలు.
877. ఓం నిరాలంబాయై నమః
ఏ విధమైన ఆలంబమూ లేని మాతకు ప్రణామాలు.
878. ఓం స్వాత్మారామాయై నమః
స్వాత్మయందే రమించు మాతకు ప్రణామాలు.
879. ఓం సుధాసుత్త్ర్యై నమః
అమృతాన్ని స్రవింపజేయునట్టి అమృతమయమూర్తికి ప్రణామాలు.