సప్తదశోధ్యాయం
(అమ్మవారి ఆద్యరూపం వర్ణన)
శ్లోకాలు: 152/2-167/1, సహస్రనామాలు: 801-900
821. ఓం బ్రహ్మణ్యై నమః
బ్రహ్మణీ శక్తి స్వరూపిణికి వందనాలు.
822. ఓం బ్రహ్మణే నమః
బ్రహ్మనామక దేవతా మూర్తికి వందనాలు.
823. ఓం జనన్యై నమఃv
యావద్విశ్వానికీ జననియైన లలితాంబకు వందనాలు.
824. ఓం బహురూపాయై నమః
అనేక రూపాలుగల మాతకు ప్రణామాలు.
825. ఓం బుధార్చితాయై నమః
పండితులే, దేవతలచే ఆరాధించబడునట్టి మాతకు నమస్కారాలు.
826. ఓం ప్రసవిత్ర్యై నమః
సర్వమునూ సృష్టించునట్టి తల్లికి వందనాలు.
827. ఓం ప్రచండాయై నమః
తీవ్రక్రోధ స్వరూపిణికి వందనాలు.
828. ఓం ఆజ్ఞాయై నమః
సర్వులనూ ఆజ్ఞాపించగల శక్తి స్వరూపిణికి వందనాలు.
829. ఓం ప్రతిష్టాయై నమః
విశ్వవిఖ్యాత మహత్తర ప్రతిష్ఠకల మాతకు వందనాలు
830. ఓం ప్రకటాకృత్యై నమః
జీవులయందు ‘అహం’ (‘నేను’ అనే భావం) అనే రూపంలో ప్రకటితమౌతున్న తల్లికి నమస్కారము.
831. ఓం ప్రాణేశ్వర్యై నమః
ప్రాణశక్తి పై అధిరోహించి ఉండునది (లేదా నడుపునది) అయిన తల్లికి నమస్కారము.
832. ఓం ప్రాణధాత్ర్యై నమః
ప్రాణములు నిచ్చి జగత్తును జీవింపచేయు తల్లికి నమస్కారము.
833. ఓం పంచాశత్పీఠ రూపిణ్యై నమః
ఏబది పీఠములలో విరాజిల్లునది (లేదా అకారాది క్ష కారాంతములైన ఏభై వర్ణముల రూపంలో ఉండునది) అయిన తల్లికి నమస్కారము.
834. ఓం విశృంఖలాయై నమః
బంధములు, విధి నిషేధములు లేక సర్వ స్వతంత్రురాలు అయిన తల్లికి నమస్కారము.
835. ఓం వివిక్తస్థాయై నమః
ఆత్మానాత్మ వివేకశీలురైన వారి యందు వుండు తల్లికి నమస్కారము.
836. ఓం వీరమాత్రే నమః
వీరులైన ఉపాసకులకు జనని అయిన తల్లికి నమస్కారము.
837. ఓం వియత్ర్పసవే నమః
ఆకాశం నుండి మిగిలిన సృష్టి అంతా జరుగగా, అట్టి ఆకాశాన్ని ఉద్భవింపజేసిన తల్లికి నమస్కారము.
838. ఓం ముకుందాయై నమః
జీవులకు ముక్తి నిచ్చు తల్లికి నమస్కారము.
839. ఓం ముక్తి నిలయాయై నమః
మోక్షం పొందినవారు చేరు స్థానమై ఉన్న తల్లికి నమస్కారము.
840. ఓం మూలవిగ్రహ రూపిణ్యై నమః
బాల మొదలైన శక్తులకు మూలమైన ఆదిశక్తి రూపంగా ప్రకటితమైన తల్లికి నమస్కారము.
841. ఓం భావజ్ఞాయై. నమః
సకల భావములను ఎరుగునది అయిన తల్లికి నమస్కారము.
842. ఓం భవరోగఘ్న్యై నమః
సంసారమనే రోగాన్ని నాశనం చేయు తల్లికి నమస్కారము.
843. ఓం భవచక్ర ప్రవర్తిన్యై నమః
సంసార (జనన- మరణ) చక్రాన్ని ప్రవర్తింపజేయు తల్లికి నమస్కారము.
844. ఓం ఛందస్సారాయై నమః
వేదముల సారము తానే అయిన తల్లికి నమస్కారము.
845. ఓం శాస్త్రసారాయై నమః
సకల శాస్త్రముల సారము తానే అయి వున్న తల్లికి నమస్కారము.
846. ఓం మంత్రసారాయై నమః
సర్వ మంత్రముల సారము తానే అయి వున్న తల్లికి నమస్కారము.
847. ఓం తలోదర్యై నమః
చతుర్దశ భువనాలను (పదునాల్గు లోకాలనూ) తన ఉదరమందు కలిగివున్న తల్లికి నమస్కారము.
848. ఓం ఉదారకీర్త్యై నమః
మహత్తరమైన కీర్తిని కలిగి వున్న తల్లికి నమస్కారము.
849. ఓం ఉద్దామవైభవాయై నమః
అత్యంత వైభవము గల తల్లికి నమస్కారము.
850. ఓం వర్ణరూపిణ్యై నమః
వర్ణములనే (అక్షరములనే) తన రూపముగా గల తల్లికి నమస్కారము.