షోడశోధ్యాయం
(శ్రీమాత విరాడ్రూప షోడశకళల వర్ణన)
శ్లోకాలు: 137-152/1, సహస్రనామాలు: 701-800
791. ఓం సత్యజ్ఞానానంద రూపాయై నమః
సత్యము-జ్ఞానము, ఆనందము ఈ మూడు కలసిన స్వరూపముగల తల్లికి వందనాలు.
792. ఓం సామరస్యపరాయణాయై నమః
సామరస్యభావములో విశేషాశక్తికల మాతకు, సామగానరసమందు ప్రీతిగల మాతకు నమస్కారాలు.
793. ఓం కపర్దిన్యై నమః
కపర్ది--అనగా శివుడు, శివపత్ని కావున కపర్దిని-- అట్టి తల్లికి వందనాలు.
794. ఓం కళామాలాయై నమః
కళలనే మాలగా ధరించిన మాతకు ప్రణామాలు.
795. ఓం కామదుఘే నమః
కామధేను స్వరూపిణికి వందనాలు.
796. ఓం కామరూపిణ్యై నమః
మన్మధ స్వరూపిణికి వందనాలు.
797. ఓం కళానిధ్యై నమః
సర్వకళలకూ నిధియైన తల్లికి వందనాలు.
798. ఓం కావ్యకళాయై నమః
కావ్యకళా స్వరూపిణియైన లలితాంబకు వందనాలు.
799. ఓం రసజ్ఞాయై నమః
సర్వరస పరిజ్ఞానం కల తల్లికి నమస్కారాలు.
800. ఓం రసశేవధయే నమః
వేదప్రామాణ్యం గల రసమే ఆత్మగాకల దేవికి నమోవాకాలు.
* * * షోడశోధ్యాయం సమాప్తం * * *
సప్తదశోధ్యాయం
(అమ్మవారి ఆద్యరూపం వర్ణన)
శ్లోకాలు: 152/2-167/1, సహస్రనామాలు: 801-900
801. ఓం పుష్టాయై నమః
పుష్టి రూపిణీ, పుష్టి ప్రదాయిని యైన మాతకు ప్రణామాలు.
802. ఓం పురాతనాయై నమః
అత్యంత స్వరూపిణికి ప్రణామాలు.
803. ఓం పూజ్యాయై నమః
పూజ్యునీయురాలైన ‘అమ్మ’కు వందనాలు.
804. ఓం పుష్కరాయై నమః
పుష్కరనామక దివ్యతీర్థ స్వరూపిణికి ప్రణామాలు.
805. ఓం పుష్కరేక్షణాయై నమః
విశాలపద్మసదృశ సుందర ప్రపుల్ల నయనాలు గల మాతకు ప్రణామాలు.
806. ఓం పరంజ్యోతిషే నమః
పరంజ్యోతి స్వరూపిణికి వందనాలు.
807. ఓం పరంధామ్నే నమః
పరంధామ స్వరూపిణికి వందనాలు.
808. ఓం పరమాణవే నమః
అత్యంత సూక్ష్మ స్వరూపమైన పరమాణు స్వరూపిణికి వందనాలు.
809. ఓం పరాత్పరాయై నమః
సమస్త దేవతలకన్న, త్రిమూర్తుల కన్న మిన్నయైన పరాత్పర స్వరూపిణికి వందనాలు.
810. ఓం పాశహస్తాయై నమః
పాశాన్ని ధరించిన మాతకు నమస్కారాలు.
811. ఓం పాశహంత్ర్యై నమః
అఖండనీయ సంసార పాశాలను, పశుపాశాలను, బంధాలను ఖండించి విముక్తిని ప్రసాదించునట్టి తల్లికి వందనాలు.
812. ఓం పరమంత్రవిభేదిన్యై నమః
శత్రువులచే ప్రయోగించినబడిన మంత్ర ప్రయోగాదులను భేదించి తన భక్తులను రక్షించునట్టి మాతకు వందనాలు.
813. ఓం మూర్తాయై నమః
మూర్త స్వరూపిణికి వందనాలు.
814. ఓం అమూర్తాయై నమః
రూపరహితంగా భాసిల్లునట్టి అమూర్త కూడా వందనాలు.
815. ఓం అనిత్యతృప్తాయై నమః
అనిత్యమైన తృప్తిగల దేవికి వందనాలు.
816. ఓం మునిమానసహంసికాయై నమః
మునులు మానసరోవరాలలో విహరించునట్టి హంసినీ రూపిణీకి వందనాలు.
817. ఓం సత్యవ్రతాయై నమః
సత్యభాషణమే సువ్రతంగా గల మాతకు ప్రణామాలు.
818. ఓం సత్యరూపాయై నమః
సత్యమే రూపంగాగల మాతకు వందనాలు.
819. ఓం సర్వాంతర్యామిణ్యై నమః
సర్వే సర్వత్రా వ్యాపించి భాసిల్లు లలితాంబకు వందనాలు.
820. ఓం సత్యై నమః
స్త్రతీత్వ స్వరూపిణికి-- పతివ్రతా పవిత్ర రూపిణికి నమోవాకాలు.