Menu Close

page title

లకుముకి పిట్టలు

King Fisher Bird

లకుముకి పిట్ట
లడాయిలేనీ
బడాయిపిట్ట !
రంగులపిట్ట
దుర్భిణి దృష్టీ-
దూరపుచూపు,
లకుముకి పిట్ట,
చిటికెడి పిట్ట

ఇవి అందమైన రంగుల పక్షులు. అనేక సైజుల్లో ఉన్న ఈ సమూహాన్ని 'ఆల్సెడినిడె' అనే ఒకే ఒక కుటుంబంగానూ, మూడు ఉప కుటుంబాలుగనూ చెప్తారు. ఆల్సెడినిడె అనే నదీ కింగ్ ఫిషర్లు, హల్క్యోనిడె అనే చెట్టు కింగ్ ఫిషర్లు, సెరిలిడె అనే నీటి కింగ్ ఫిషర్లు అని మూడు కుటుంబాలుగా ఉన్నట్లు తెలుస్తున్నది. సుమారుగా 90 కింగ్ఫిషర్ జాతులు ఉన్నాయి.

వీటికి పెద్ద తలలు, పొడవాటి, సూదివంటి ముక్కులు, పొట్టి కాళ్ళు, పొట్టిగా మందంగా ఉన్నతోకలతో చిత్రంగా ఉంటాయి. చాలా జాతుల పక్షులు అందంగా ఉండే ఆకర్షణీయమైన రెక్కలతో ఉంటాయి. చాలా జాతి పక్షులు ఉష్ణమండలాలలో కొన్ని అడవులలో నివసిస్తుంటాయి. ఇవి చేపలను వేటాడి తింటాయి, చెట్టుకొమ్మలమీద ఉంటూ క్రిందకు వచ్చి చేపలను పట్టుకుని తీసుకువెళ్ళి తింటుంటాయి. కొన్ని చెట్లమీద ఉండే చిన్న బల్లుల వంటివాటిని కూడా తింటుంటాయి. ఇవి గూళ్ళను కొండలలోని బెజ్జాలలో కట్టుకుంటాయి.

ఈ మూడు కుటుంబాల గురించిన వర్గీకరణ చాలా కష్టమైనది. వివాదస్పదమైనది కూడా. కేవలం ఇది కింగ్ ఫిషర్ అనే పక్షి గురించి మనం చెప్పుకోడం గనుక పూర్తి స్థాయి, వివరణ ఇవ్వడంలేదు. [సృష్టిలోని జీవ జంతువుల గురించిన అద్భుతాల గురించి తెల్సుకునేందుకే ఈ వ్యాసాలు పరిమితమని మనవి].

మూడు కుటుంబాలలోని కింగ్ ఫిషర్ లు అమెరికాలో, ఫిజీలో, ఆస్ట్రేలియాలో, పసిఫిక్ మహా సముద్రం తూర్పు మరియు దక్షిణంలో ఆఫ్రికా నుండి దక్షిణ పసిఫిక్ లోని టాంగా వరకూ... ఇలా విశ్వ వ్యాప్తిని కలిగి ఉన్నాయి. చాలా జాతులు నశించిపోయినట్లు తెలుస్తున్నది.

ఫిజీలోని కాలర్డ్ కింగ్‌ఫిషర్ జాతులు ఆఫ్రికా నుండి దక్షిణ పసిఫిక్ లోని టాంగా వరకూ విస్తరించి ఉన్నాయి.

king-fisher02.jpg

[ఆఫ్రికా నుండి దక్షిణ పసిఫిక్ లోని టాంగా వరకూ విస్తరించి ఉన్నఫిజీలోని కాలర్డ్ కింగ్‌ఫిషర్.]

king-fisher03.jpg

[పొడవాటి తోకల న్యూగెనియో లోని ప్యారడైజ్ కింగ్‌ఫిషర్లు]

న్యూ గెనియో యొక్క ప్యారడైజ్ కింగ్‌ఫిషర్లు చిత్రంగా పొడవాటి తోకలతో ఉంటాయి. ఆంగ్లంలో కింగ్ ఫిషర్ అంటే ఆంధ్రంలో టిట్టిభము అంటారు. కింగ్‌ఫిషర్లు తరచుగా చేపలు లభించేప్రాంతాల్లో నివాసాలు ఏర్పర్చుకుని ఉంటాయి, చాలా జాతులు ఇతర ఆహారాన్ని వేటాడి తింటాయి.

*** సశేషం ***

Posted in January 2019, వ్యాసాలు

3 Comments

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!