Menu Close
mg
- మధు బుడమగుంట -
Song

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో

ప్రేమ అనేది మాటలకందని ఒక మధురానుభూతి. అది ఎప్పుడు ఏ ఇద్దరి మధ్యన ఏర్పడుతుందనేది ఎవ్వరూ చెప్పలేరు. అందులోని పవిత్ర భావాన్ని అర్థం చేసుకుని అదే భావనతో మనసులతో మాట్లాడుకున్న జంట మధ్యన ఆ ప్రేమ స్వచ్ఛమై, పారదర్శకంగా మరింత వన్నెతో చిగురిస్తుంది. అటువంటి ప్రేమను పొంది అనుభవిస్తున్న ఆ జంట, మాటలతో మాట్లాడాలని పదాల కొరకు వెతుకుతూ ఉండవలసిన అవసరం లేకుండా కేవలం మనసులతో కూడా చక్కగా ముచ్చడించుకోవచ్చు అనే చక్కటి అనుభూతితో వ్రాసిన ఈ పాట నిజంగా ఎంతో హృద్యంగా అందరినీ అలరించింది. మీకు చూస్తూ, వింటూ ఆ అనుభూతిని పొందండి.

movie

అనంతపురం 1980 (2008)

music

వెన్నెలకంటి

music

జేమ్స్ వసంతన్

microphone

బెన్నీ దయాళ్, దీప మిరియం

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి
అంతలోనె మౌనమేలనే
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే

కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి
అంతలోనె మౌనమేలనే

మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటు మాటు గానం
కనులే కలిపే ఈ వేళ
కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్ని కవితా ప్రేమేనేమో
అది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది

పగలే రేయైన యుగమే క్షణమైన
కాలం నీతోటి కరగనీ
అందని జాబిల్లి అందిన ఈ వేళ
ఇరువురి దూరాలు కరగనీ
ఒడిలో వాలాలనున్నది
వద్దని సిగ్గాపుతున్నది
తడబడు గుండెలలో మోమాటమిది
కొంటె చూపుతో నీ కొంటె చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి
అంతలోనె మౌనమేలనే

కళ్ళలో నిద్రించి కలలే ముద్రించి
మదిలో దూరావు చిలిపిగా
నిన్నే ఆశించి నిన్నే శ్వాసించి
నీవే నేనంటూ తెలుపగా
చూపులు నిన్నే పిలిచెనే
నా ఊపిరి నీకై నిలిచెనే
చావుకు భయపడనే నువ్వుంటే చెంత

కళ్ళు రాసే నీ కళ్ళు రాసే
ఒక చిన్న కవితా ప్రేమేనేమో
అది చదివినప్పుడు
నా పెదవి చప్పుడు
తొలి పాటే నాలో పలికినది

మాటరాని మౌనం మనసే తెలిపే
ఎద చాటు మాటు గానం
కనులే కలిపే ఈ వేళ

కంటి చూపుతో నీ కంటి చూపుతో
నా మనసు మెల్లగా చల్లగా దోచావే
చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో
ఏదో మాయ చేసి
అంతలోనె మౌనమేలనే

Posted in June 2024, పాటలు