జై ఝావ్ బే బ్రిడ్జి (Jiaozhou Bay Bridge), చైనా
మన సిరిమల్లె లో ఇంతకుమునుపు అతి పొడవైన కాజ్ వే (అమెరికా) గురించి వ్రాశాను. అయితే అంతకన్నా ఎక్కువ పొడవుతో అంటే దాదాపు 27 మైళ్ళ పొడవుతో ఈ బ్రిడ్జి ని నిర్మించడం జరిగింది.
ఈ వంతెన సముద్రం మీద నిర్మించినందున తుఫాన్ ప్రభావం, గాలి ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. కనుకనే ఈ వంతెనను భూకంపాలను, తుఫాన్లు మరియు ప్రచండ పవనాలను తట్టుకునే విధంగా 5200 పిల్లర్లతో స్థిరంగా నిర్మించడం జరిగింది. అంతేకాదు దాదాపు 3 లక్షల టన్నుల బరువు గల షిప్ ఈ బ్రిడ్జిని ఢీకొన్ననూ ఏమీ కాదు.
అయితే ఈ వంతెన నీటి మీద నిలిచిన పొడవు కేవలం పదహారు మైళ్ళు మాత్రమే అయినందున దీనిని ప్రపంచంలో అతి పొడవైన నీటి మీద నిర్మించిన వంతెన గా పరిగణించ అవసరం లేదని విజ్ఞుల అభిప్రాయం. ఏది ఏమైనా మనిషి మేధోసంపత్తికి, ఆధునిక పరిజ్ఞాన ఉనికిని ఈ వంతెన మరోసారి ఋజువు చేస్తున్నది.
Source: Popular Science »