జంటపండువుపంట
సీ. తొమ్మిదిరాత్రుల దొడ్డసంబరముల మలుపండువై(1) వచ్చి మనసు నిండ విజయోత్సవంబుల సృజియించి మోదాభి షేకంబు గావించు సిరు లొసంగి పరమాత్మరూపమే నిరతమై యజ్ఞాన తిమిరమ్ము హరియించు దీపపంక్తి వెలుగుబాటల జూపి విశ్వ మంతయు శాంతి వృద్ధికి నిలయమౌ బుద్ధి నొసఁగి తే.గీ. చెడుప్రవర్తన(2) నాహుతి సేసి మంచి మించి నెలకొన జగదంబ మేలు గూర్చు పర్వయుగ(3) మొక్కమాసానఁ(4) బరిఢవిల్లు భాగ్యమబ్బుట యసదృశవరము గాదె? (1) నవరాత్రులు చేసికొను తొలిపండువ ప్రథమపూజ్యుడైన గణపతికి భాద్రపదములో, మలుపండువ పరాశక్తికి ఆశ్వయుజములో (2) రావణప్రవర్తన దసరాకి, నరకాసురప్రవర్తన దీపావళికి (3) దసరాపండుగ + దీపావళి (4) ఒకే ఆంగ్లమాసము [అక్టోబర్] లో