Menu Close
Aduri Hymavathi
ఇది మల్లెలవేళ అనీ
ఆదూరి హైమావతి శ్రీనివాస రావు
Jasmine Flowers

మల్లె అనగానే హృదయం పులకరించి ముక్కు ఆఘ్రాణించి, మనసు పరిమళిస్తుంది. మల్లెను ప్రేమించనివారు ఉండరు. మానవులనుండీ దేవుళ్లవరకూ అంతా మల్లె మాలలను ధరించేవారే. మల్లెలో చాలా రకాలున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా మల్లెల జాతులు చాలా ఉన్నాయి. మనకు తెలిసిన మల్లె జాతి మాత్రం జాస్మిన్ సంబక్‌. దీన్నే అరేబియన్‌ జాస్మిన్‌, మల్లిక, కుండమల్లిగై, మోగ్రా.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. పూలరేకుల సువాసనను అనుసరించి దీన్లో రకాలున్నాయి.

ఒకే వరుసలో ఐదు రేకలతో ఉండేదాన్ని రెక్కమల్లె, అంటారు. గుండుమల్లె చిన్నసైజు రోజాపువ్వంత ఉండి వాసనలో, రోజాను ఓడిస్తుంది. దీన్ని అరేబియన్‌ నైట్స్ అంటారు. కాడ సన్నగా ఉండి గుండ్రని మొగ్గల్లా ఉండే బొడ్డు మల్లెలను బెల్లె ఆఫ్‌ ఇండియా అంటారు. వీటిని మైసూర్‌ మల్లెలనీ అంటారు. ఎండ తగులుతుంటే ఏడాది పొడవునా పూస్తుంటాయి. వీటిల్లోనే మరోరకం సన్నని పొడవాటి రేకలతో ఉంటుంది. దీన్ని బెల్లె ఆఫ్‌ ఇండియా ఎలాంగేటా అంటారు. ఇంకోటి సెంటుమల్లె. ఇందులో రెండు రకాలు. గ్రాండ్‌ డ్యూక్‌ ఆఫ్‌ టస్కనీ, గ్రాండ్‌ డ్యూక్‌ ఆఫ్‌ సుప్రీమ్‌. పొడవాటి పొదగా పెరిగే ఈ రకాల్లో ఒకే చెట్టుకి ఒకే సమయంలో రకరకాల పరిమాణాల్లో పూలు పూస్తాయి. ఈ పూలు ఒక్కరోజుకే రాలిపోకుండా కొన్నిరోజుల పాటు చెట్టుకే ఉండి సుగంధాలు వెదజల్లుతాయి. దొంతరమల్లె అనే మరో రకం ఉంది. ఇందులో పూరేకులు అరలు అరలుగా అమరి ఉంటాయి. మాఘమాసంలో ఎక్కువగా పూసేదే జాస్మినమ్‌ మల్టీఫ్లోరమ్‌. మాఘ మల్లిక, స్టార్‌ జాస్మిన్‌ అని పిలిచే ఈ పూలు ఎక్కడా ఆకు అన్నది కనిపించకుండా పూసి మొక్క మొత్తం తెల్లగా పరిమళిస్తుంది.

మల్లికను సంస్కృతంలో మల్ల లేదా మల్లి అంటారు. గ్రీష్మ ఋతువు ఆరంభ సమయంలో ఇవి పూస్తాయి. తీగలకు పాకే మల్లె ఒకరకం ఐతే గుబురుగా పెరిగి పూలుపూచే గుండుమల్లె ఒకటి.

ఎన్ని పేర్లున్నా, పూలలొ చిన్నాపెద్ద ఉన్నా సువాసనలో మాత్రం మల్లెకు సాటి మరొకటి లేనేలేదు. ఎన్నో సినిమా పాటల్లో మల్లె ప్రస్తావన ఉంది.

క్లుప్తంగా చెప్పుకుంటే మల్లెలు చాలా రకాలు --

ముఖ్యమైనవి గుండుమల్లె, జాజిమల్లి కాగడా మల్లె చాలా రకాలున్నా మల్లె అనగానే మరువలేని పరిమళాన్ని అందించేటటువంటి సువాసన భరితమైన పువ్వు తెల్లగా గుండ్రంగా ఎంతో అందంగా ఉంటుంది. జాజిమల్లిని చూసినట్లయితే దీని యొక్క పరిమళం మనం ఒక్కసారి పీల్చుకున్నామంటే ఎంతోసేపు మనసులో నిలిచి పోయి హృదయం పరిమళభరితమవుతుంది. కాగడా మల్లె పొడవుగా ఉంటాయి దండలు కట్టడానికి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు.

ఆయుర్వేదంలో ఈ జాజిమల్లె ఔషధ గుణాలు అత్యంత విలువైనవి. పొదల జాతికి చెందినది హాలీవుడ్ కుటుంబానికి చెందినది తీగలా పెరుగే సువాసన నిచ్చే తెల్లని పూవు. ఉష్ణ మండల ప్రాంతాలలో ఇది పెరుగుతుంది. ఆస్ట్రేలియాలో 200 జాతుల మల్లెలు ఉన్నాయంటే నమ్మలేం. జాస్మిన్ జాతికి చెందిన జాస్మిన్ మొక్కలు వాటి సువాసనతో మంత్ర ముగ్ధులను చేస్తాయి. వాసన కోసం మల్లె మొక్కలను, మల్లె పూలను సెంటు అత్తర్లతో వాడుతారు మంచి వ్యాపారం.

వైద్యంలో

  1. అలసిపోయిన కనులపై మల్లెలను కొద్దిసేపు ఉంచినట్లయితే కళ్ళు చల్లబడతాయి.
  2. తలలో చుండ్రు సమస్య అధికంగా ఉంటే మెంతులతోపాటు కాసిని ఎండుమల్లె పూలు కలిపి నూరి తలకు పట్టిస్తే చుండ్ర సమస్య తగ్గడమే కాక జుట్టు కూడా పట్టు కుచ్చులా మెరిసిపోతుంది.
  3. కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నానబెట్టి ఆ తర్వాత బాగా మరగబెట్టి తలకు పట్టిస్తే కేశాలు ఆరోగ్యంగానేకాక మాడుకు చల్లదనం కూడా.
  4. మల్లె పువ్వులను ఫేస్ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి కొద్దిగా పాలు కలిపి, నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముల్తానామట్టి, గంధం, తేనె అరస్పూన్ చొప్పున కలిపి ప్యాక్ వేసుకోవాలి.
  5. మల్లెపూలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందువల్లే చాలా ఔషధాలలో మల్లెపూలను వాడతారు.
Posted in August 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *