ఎనభయ్యో దశకంలో వచ్చిన ‘నీరాజనం’ ఒక చక్కటి ప్రేమకథా భారతీయ చిత్రంగా పేరుగాంచింది. యద్దనపూడి సులోచనా రాణి గారి నవలకు చిత్రరూపం కల్పించి ప్రేక్షకులకు అందించిన అశోక్ కుమార్ గారు సదా స్మరణీయులు. ఈ సినిమాలోని ప్రతి పాట కూడా ఎంతో చక్కటి సాహిత్య పదజాలంతో అలరారుతూ సంగీత ప్రియులను, సాహిత్య ప్రియులను నేటికీ అలరిస్తున్నది.
ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ
ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ
క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో
క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో
అనురాగమే తల ఊపెను నీళాకాశ తీరాలలో
ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ
ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ
కలగీతమై పులకించెను నవకళ్యాణ నాదస్వరం
కథ కానిదీ తుది లేనిది మన హృదయాల నీరాజనం
కలగీతమై పులకించెను నవకళ్యాణ నాదస్వరం
కథ కానిదీ తుది లేనిది మన హృదయాల నీరాజనం
ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ
ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ