100
I DIVE down into the depth of the ocean of forms, hoping to gain the perfect pearl of the formless.
No more sailing from harbour to harbour with this my weather-beaten boat.
The days are long passed when my sport was to be tossed on waves. And now I am eager to die into the deathless.
Into the audience hall by the fathomless abyss where swells up the music of toneless strings I shall take this harp of my life.
I shall tune it to the notes of for ever, and, when it has sobbed out its last utterance, lay down my silent harp at the feet of the silent.
సీ. అపురూప ముత్యమ్ము నాశించి, ఆకార అబ్ధిలో దూకెద నడుగు వరకు జీర్ణమౌ పడవలో చిన్న రేవుల యాత్ర యెంతయున్ రుచిరాదు యింకపైన అలలపై యాటలు ఆగిపోయెనెపుడొ అమృతజలధి నంత మౌదునింక -- సాగర గర్భాన సంగీత సభలోన నిశ్శబ్ద గానమ్ము నిండు చోట ఆ. జీవితమను వీణ చేకొని, తంత్రుల శృతిని జేతునమృత జతుల తోడ చరమ గీతి పాడు తరుణమ్ము ముగియగా వదలి వైతు నీదు పదములందు
101
EVER in my life have I sought thee with my songs. It was they who led me from door to door, and with them have I felt about me, searching and touching my world.
It was my songs that taught me all the lessons I ever learnt; they showed me secret paths, they brought before my sight many a star on the horizon of my heart. They guided me all the day long to the mysteries of the country of pleasure and pain, and, at last, to what palace gate have they brought me in the evening at the end of my journey?
సీ. నిరతమన్వేషించు నిన్నె, నా గీతాలు ఇల్లిల్లు గొనిపోవు నివియె నన్ను నలువైపులదిరిగి నాలోకమును నేను అనుభవించితి గీతమాలపించి బ్రతుకులో పాఠాలు, అతిగూఢ మార్గాలు నేర్చుకొంటిని పాట కూర్చినపుడె హృదయ గగనమందు కదలు నక్షత్రాల కనుముందు నిల్పెనీ గానలహరి దినదినమ్ము నాకు దిక్సూచిగా నిల్చి విప్పి జూపి పాట, వింతలెన్నొ, యిపుడు నిల్పె నన్ను యేదివ్యసౌధంపు గడపముందు యాత్ర గడిచి నంత!!!
102
I BOASTED among men that I had known you. They see your pictures in all works of mine. They come and ask me, "Who is he?" I know not how to answer them. I say, "Indeed, I cannot tell." They blame me and they go away in scorn. And you sit there smiling.
I put my tales of you into lasting songs. The secret gushes out from my heart. They come and ask me, "Tell me all your meanings." I know not how to answer them. I say, "Ah, who knows what they mean!" They smile and go away in utter scorn. And you sit there smiling.
సీ. నిన్నెరుగుదునంచు నెన్నియో బీరాలు పలికి, గొప్పలుపోతి, పరుల చెంత నిన్నునా కృతులందు కన్నవారలు, నన్ను తెలుపుమెవ్వరంచు పలికినంత వర్ణింప జాలక వాక్కు యుడిగిపోయె దూషించి వెడలిరి తోటివారు మందహసితుడవై మారుమాటాడక కూరుచుంటివి నీవు నేరకెదియు!!! ఆ. నీదు కథల నన్ని నిత్యనూతనమైన పాటలందు యొదిగి పాడుకొందు గుండె నుండి పొంగు గుప్తమౌ పదముల అర్థమేమనంచు అడిగి నంత,
ఆ. వీని భావమేమొ వివరింప లేనంటి, యెరుక పరచు మార్గమెరుగ లేక!! వెక్కిరించి నవ్వి వీడరందరు, నీవు, నవ్వుచుందువచట నన్ను జూచి!!!
103
IN one salutation to thee, my God, let all my senses spread out and touch this world at thy feet.
Like a rain-cloud of July hung low with its burden of unshed showers let all my mind bend down at thy door in one salutation to thee.
Let all my songs gather together their diverse strains into a single current and flow to a sea of silence in one salutation to thee. Like a flock of homesick cranes flying night and day back to their mountain nests let all my life take its voyage to its eternal home in one salutation to thee.
సీ. ఒక్క వందనముతో దిక్కుల ప్రసరించి ఇంద్రియమ్ముల తాక నిమ్ము భువిని వానమబ్బుగ వంగి వందనమ్మొకమారు గరుపనీ బుద్ధి, నీ గడపముందు నాగానములు వేల రాగాలతో గూడి సమ్మేళనమ్మైన సరిత వోలె, నిర్వాణ జలధిలో నిశ్శబ్దముగ జేర, అభివందనములివే అందుకొనుము
ఆ. ఎండ వాన లోన కొండకోనలెగిరి గూడు తమిని జేరు కొంగలవలె జీవ పారువమ్ము జేరగా తన యిల్లు నాదు నమసులివియె నాథ నీకు