70
IS it beyond thee to be glad with the gladness of this rhythm? To be tossed and lost and broken in the whirl of this fearful joy?
All things rush on, they stop not, they look not behind, no power can hold them back, they rush on.
Keeping steps with that restless, rapid music, seasons come dancing and pass away - colours, tunes, and perfumes pour in endless cascades in the abounding joy that scatters and gives up and dies every moment.
ఆ. హద్దు లేక సాగు ఆనంద ఖేలలో
తనిసి పోవ నీకు మనసు కరువ?
పరుగుదీయు నన్ని మరలిచూడక, పృథ్వి
నెవరి తరము కాదు యెదురు నిలువ!
ఆ. అలుపు లేక సాగు ఆగానలహరిలో
అడుగుకలుపు ఋతువులార్తితోడ
పరిమళాలు వేల వర్ణాలతో హృష్టి
పొంది మూర్ఛనలను పొరలిపోవు
71
THAT I should make much of myself and turn it on all sides, thus casting coloured shadows on thy radiance - such is thy maya. Thou settest a barrier in thine own being and then callest thy severed self in myriad notes. This thy self-separation has taken body in me.
The poignant song is echoed through all the sky in many-coloured tears and smiles, alarms and hopes; waves rise up and sink again, dreams break and form. In me is thy own defeat of self.
This screen that thou hast raised is painted with innumerable figures with the brush of the night and the day. Behind it thy seat is woven in wondrous mysteries of curves, casting away all barren lines of straightness.
The great pageant of thee and me has overspread the sky. With the tune of thee and me all the air is vibrant, and all ages pass with the hiding and seeking of thee and me.
సీ. ఆడంబరముతోడ అన్నివైపుల తిరిగి
తళుకుమని నగలు వెలుగు చుండ
నామేని కాంతులు నీమీద మెరవంగ
మైమరతును!! యెంత మాయ నీది!!
విశ్వాత్మకుడవయ్యు విభజించు కొనినిన్ను
పిలుచుకొందువు నీవె వేల విధుల
అగణితంబగు నీదు ఆకృతులన్, నాకు
అస్థిత్వ మిడితి వయాచితముగ
ఆ. అశ్రుధారలందు ఆనంద బాష్పాల
తెగని ఆశలందు దిగులు యందు
మారు మ్రోగు నీదు మధుర గాన లహరి
నిండిపోవు స్వామి నింగి యంత
సీ. కడలిలో కెరటాలు పడిలేచు నిరతమ్ము
కల, పొంది రూపమ్ము కరగి పోవు
రేబవళ్ళను చిత్ర లేఖినులుగ జేసి,
అవని యవనిక పై అందమైన,
రూపాలు చిత్రించి, చూపితివో ప్రభూ!
తెరవెన్క నిలిచి నీ దివ్య ఖేల!!
సారరహితమైన సరళరేఖల వీడి
ఒంపు సొంపుల తోడ ఒంటిదగుచు
ఆ. అలరుచుండు నీదు అందమౌ పీఠమ్ము,
తెలియరాని కళల వెలిగిపోయి!!
నీవు నేననియెడి నిత్యోత్సమ్ములు
నిండిపోయె నేడు నింగి లోన
అ. మన యిరువురి పాట మైమరచినగాలి
ఆడుచున్నదిపుడు అవనిపైన
ఆగిపోక సాగు దాగురింతాటలో
కదిలె యుగములెన్నొ కాలమందు!!!
72
HE it is, the innermost one, who awakens my being with his deep hidden touches. He it is who puts his enchantment upon these eyes and joyfully plays on the chords of my heart in varied cadence of pleasure and pain.
He it is who weaves the web of this maya in evanescent hues of gold and silver, blue and green, and lets peep out through the folds his feet, at whose touch I forget myself.
Days come and ages pass, and it is ever he who moves my heart in many a name, in many a guise, in many a rapture of joy and of sorrow.
సీ. అంతరాంతరముల నతిసున్నితంబుగా
తట్టిలేపునతడు తమసునుంచి
మంత్రముగ్ధుని జేసి మరపించి, కనులపై
అందమౌ ప్రకృతిగా ఆవరించి
బాధ, సౌఖ్యమ్ములు స్వరములై అమరగా
మధుర తంత్రులమీటు యెదనతండు
పచ్చ, నీల, రజత, పసిడి వర్ణాలతో
మాయయను తెరను నేయునతడు
ఆ. తెర మడతల నడుమ దివ్యపాదమ్ములు
తొంగి చూచుచుండ పొంగిపోయి
పరవశించి పోతి ప్రణమిల్లియపుడు నే
నతని పాదమంటి ఆదమరచి
ఆ. కాల చక్రమందు గడచు యుగములెన్నొ
వెతల, వేడుకలను జతగ నిలిచి
వేయి పేర్ల తోడవేల రూపాలతో
ఎదను ప్రేమ నింపు ఈశుడతడు
73
DELIVERANCE is not for me in renunciation. I feel the embrace of freedom in a thousand bonds of delight.
Thou ever pourest for me the fresh draught of thy wine of various colours and fragrance, filling this earthen vessel to the brim.
My world will light its hundred different lamps with thy flame and place them before the altar of thy temple.
No, I will never shut the doors of my senses. The delights of sight and hearing and touch will bear thy delight.
Yes, all my illusions will burn into illumination of joy, and all my desires ripen into fruits of love.
సీ. ముక్తిలేదోయి విరక్తిలో!! ముదమిడు,
వేలబంధనములే స్వేచ్ఛ నాకు!!
ఈమట్టి పాత్రలో నెన్నియో రుచులతో
మధువునింపితివోయి మరులు గొలిపి
వెలిగింతునో ప్రభూ! వేల దీపమ్ములు
నీదివ్యజ్యోతితో నిఖిలమంత
కనుచూపు, వినుశక్తి, తనువుసోకిన గాలి
తెలుపునీదు యునికి నెలమితోడ
ఆ. ఇంద్రియాలనెపుడు బంధించగాబోను,
మూలనుండలేను ముక్కు మూసి!
వాంఛలన్ని పండు పరమాత్మ ప్రేమగా
భ్రమల బూది జేయు ప్రభుని యెరుక!
74
THE day is no more, the shadow is upon the earth. It is time that I go to the stream to fill my pitcher.
The evening air is eager with the sad music of the water. Ah, it calls me out into the dusk. In the lonely lane there is no passer by, the wind is up, the ripples are rampant in the river. I know not if I shall come back home. I know not whom I shall chance to meet. There at the fording in the little boat the unknown man plays upon his lute.
సీ. పొద్దుగ్రుంకెనపుడె పొడుగయ్యె నీడలు
ఏగవలెనిక నే నేటికడకు
వేదనతో నీరు వినిపించు పాటతో
తొందర చేసిన సందె గాలి,
మునిమాపు వేళలో ననుబిల్చె తోడుగా
నిర్జన వీథిలో నెనరు తోడ
శూన్యమౌ దారులన్ చురుకయ్యె చలిగాలి
నదిపైని తరగలు కదిలె వడిగ
ఆ. మరల ఇంటి వంక తిరిగి వత్తునొ లేదొ
ఎవని చూడ గలనొ యెరుక లేదు
ఏటి గట్టు చెంత పాటపాడునతడు
అధర సుధలు నింపి వెదురులోన
75
THY gifts to us mortals fulfil all our needs and yet run back to thee un-diminished. The river has its everyday work to do and hastens through fields and hamlets; yet its incessant stream winds towards the washing of thy feet.
The flower sweetens the air with its perfume; yet its last service is to offer itself to thee. Thy worship does not impoverish the world. From the words of the poet men take what meanings please them; yet their last meaning points to thee.
సీ. పల్లెసీమను జేసి, పసిడి మాగాణిగా
పరుగుదీయు నదము వసుధ పైన
జీవధారగ నది, రేవులన్నియు చుట్టి
కడకు నీ పదములె, కడుగుచుండు!!
గాలినంతట తాను గంధమ్ము నలదినా
పూవు బ్రతుకు నీదు పూజ కొరకె
సుకవి గీతమ్ములు చూపు అర్థములెన్నొ
పరమార్థము యెరుక పరచు నిన్నె
ఆ. పూజ చేసి నిన్ను పూర్ణత్వమును పొందు
భూమికెన్న డైన లేమి లేదు
నీదు కాన్కలొసగు నిత్యతృప్తిని మాకు
మరల నిన్నె జేరు తరచిజూడ
76
DAY after DAY, O lord of my life, shall I stand before thee face to face? With folded hands, O lord of all worlds, shall I stand before thee face to face?
Under thy great sky in solitude and silence, with humble heart shall I stand before thee face to face?
In this laborious world of thine, tumultuous with toil and with struggle, among hurrying crowds shall I stand before thee face to face?
And when my work shall be done in this world, O King of kings, alone and speechless shall I stand before thee face to face?
అంజలి ఘటియించి, అఖిలేశ!! ప్రతిరోజు,
నిలబడి యుండనా నీదు మ్రోల!
నిశ్చల నీరవ నింగినీడన, యెద
పరువనా నీముందు భక్తి మీర
కష్టతరమగు నీ సృష్టి చక్రమునందు
ఆటుపోట్ల నడుమ అవని లోన,
పరుగుదీయు జనుల పజ్జ నిలిచి, నీదు
మూర్తినే చూడనా యార్తి తోడ
ఆ. కడకు, సేయ వలయు కార్యమ్ములన్నియు
ముగిసి పోయినంత పుడమి పైన,
పలుకు మాని నీదు వదనమ్ము వంక నే
కనులు నిల్పియుంచి కరగి పోన!!
77
I KNOW thee as my God and stand apart - I do not know thee as my own and come closer. I know thee as my father and bow before thy feet - I do not grasp thy hand as my friend's.
I stand not where thou comest down and ownest thyself as mine, there to clasp thee to my heart and take thee as my comrade.
Thou art the Brother amongst my brothers, but I heed them not, I divide not my earnings with them, thus sharing my all with thee.
In pleasure and in pain I stand not by the side of men, and thus stand by thee. I shrink to give up my life, and thus do not plunge into the great waters of life.
సీ. దేవదేవునిగానె తెలిసి మసలుకొందు,
దరికిరానీయక తప్పుకొందు!
తండ్రిగానె తలచి తలనుంతు పదములన్,
చెలికానిగా చేయి కలుపకుందు!
ఆప్తుండవని నిన్ను అక్కున జేర్చక,
నీవొచ్చు దారిలో నిలువకుందు!
అన్నదమ్ములతోడ ఆస్తిపంచగ లేను,
సర్వమెటులనిత్తు స్వామి నీకు!!
ఆ. తోటి జనుల వెతల తోడుండగా లేను,
నీదు పజ్జ నెటుల నిలువగలను!!
ప్రాణమీయ వెరతు భవబంధములబడి
దుముక లేను జీవ ధునిని స్వామి!!!