
రెండు హృదయాల మధ్యన కలిగే ఆకర్షణీయ, ప్రేమపూరిత ఆలోచనల ఉధృతి, నిరంతరం ప్రవహించే సెలయేరు వంటిది. ఆ ఆలోచనలకు పరిపక్వత కలిగిన రోజు ప్రేయసీ ప్రియుల మధ్యన, ప్రేమికులు లేదా భార్యాభర్తల మధ్యన కలిగే ఆకర్షణ స్థానంలో ఆత్మీయ పలకరింపుల భావావేశ పులకింతలు మొదలౌతాయి. ఆ పలకరింపుల స్వచ్ఛత సాంద్రత పెరిగి ఇరు హృదయాల మధ్యన సరైన అవగాహన కలిగి పారదర్శక ప్రేమతో ఒక్కటైన నాడు ఆ జంట యొక్క జీవితం నిత్య సంతోషాలతో విలసిల్లుతుంది. అటువంటి ప్రేమ యొక్క మొదటి అంశం లోని ఆలోచనలకు అక్షరరూపం కల్పించి భాస్కర భట్ల గారు అందించిన ఈ గేయం మీకోసం...
పల్లవి :
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకి
చరణం : 1
హే... నిదుర దాటి కలలే పొంగె
పెదవి దాటి పిలుపే పొంగె
అదుపుదాటి మనసే పొంగె... నాలో
గడపదాటి వలపే పొంగె
చెంపదాటి ఎరుపే పొంగె
నన్ను దాటి నేనే పొంగె... నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకి
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
చరణం : 2
తలపుదాటి తనువే పొంగె
సిగ్గుదాటి చనువే పొంగె
గట్టుదాటి వయసే పొంగె లోలోన
కనులుదాటి చూపే పొంగె
అడుగు దాటి పరుగే పొంగె
హద్దు దాటి హాయే పొంగె... నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రికి