Menu Close
Kadambam Page Title
ఏమి లాభం..? ఏం ప్రయోజనం..?
-- పోలయ్య కూకట్లపల్లి --

మనసులేని వధువు మెడలో
మంగళసూత్రం కట్టించిన
కన్నీటితో కాపురానికి పంపిన...
దైవంలేని గుడిలో పూజలు చేయించిన...!

భగవంతునిపై భక్తిశ్రద్ధలు లేని
భజనలు చేయని నాస్తిక హస్తాల్లో
భగవద్గీత బైబిల్ ఖురాన్ వేదాలు పెట్టిన..!

అందమైన షాపింగ్ మాల్
గాజు బొమ్మను పసిడి గాజులతో...
పట్టు వస్త్రాలతో అలంకరించిన...!

త్రాగుబోతు చేతిలో త్రిశూలం పెట్టిన...
పిచ్చివాడి చేతికి రాజదండం ఇచ్చిన...
వెర్రి వెంగళప్పకు వజ్రాయుధమిచ్చిన...
అర్హతలేని వాడికి అధికారమిచ్చిన...
మండుటెండల్లో మంచువాన కోరిన...!

అంధుడికి అద్దం చూపించిన...
మూగవాడి ముందు శంఖమూదిన...
ఆకలిలేని వానికి పరమాన్నం వడ్డించిన...
అందవిహీనురాలికి ఆభరణాలు పెట్టిన..!

మతమంటే గిట్టని నాస్తికులను
ముక్కోటి దేవుళ్ళుకు మ్రొక్కమనిన..!
సరిగమలు తెలియని సంగీతజ్ఞానం
లేనివానికి వీణను సమర్పించిన...!

ఇంట్లోవాడని ఖరీదైన కిటికీలు పెట్టిన..!
వార్ధక్యంలో ఆస్తిపై ఆశతప్ప కన్నవారిపై
కరుణ లేని కసాయి కొడుకులు పుట్టిన..!
ఏమి లాభం...? ఏం ప్రయోజనం..?

ఔను!!
ఏ కుంటి వారికో
ఏ గుడ్డి వారికో ఏ బిక్షగాళ్ళకో
చిరుసహాయం అందించే ముందు ...
ఆలోచించాలి అర్హులకే అందజేయాలి...

ఏ శిల్పాభిషేకానికో...పూజల పేరిట
ఏ పుట్టల్లోనో పోసే పాలు బలహీనులైన
బాలల పొట్టల్లోపోస్తే...
ఆవిర్భవించదా..?
ఓ ఆరోగ్యకరమైన...బాలల ప్రపంచం..!
ఆలోచించండి...విజ్ఞతతో ఆచరించండి..!

Posted in July 2025, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *