Menu Close
Kadambam Page Title
ఈ అడివి మాదే
కొడుపుగంటి సుజాత

ee-adavi-naade-kavitha

గీ అడివి మాది
మేము గీ అడివి తల్లి బిడ్డలం
ఈ అడివిలకు ఎవల్లయిన వత్తె
కాల్లు సేతులు నరికి కాకులకు
నక్కలకు తిండి బెడ్తాం

మేము మీతీరు పట్టనపోల్లం కాదు
కడుపులో ఇసం బెట్టుకుని
సన్నబియ్యం కూడు తింటు
రంగుల బట్టలు తోడుక్కొని
సోకులువోతు తిరుగనికి

రాయిరప్ప సెట్టుసేమదిరుగుతు
కాయా కష్టం సేసుకుంట
అడవి తల్లి ఇచ్చే కాయపండు
ఏరుకుంటు కడుపు నింపుకొని
పుట్ట తేనె తాగి నాయంగా బతికేటోల్లం

మీరు అక్కడ నా అసుంటి ఆడపిల్ల
గాండ్లను ఎం సేస్తున్నారో నా కెరుకే
ఇక్కడ గసుంటి ఆటలు నడవవ్
రగతం సూస్తాం..జర పదిలం బిడ్డో

నా మాటగాదని సెట్లు నరకనికి
వస్తే గదే గొడ్డలితో
తుకుడలు తుకుడల్జేసీ
గీ సెట్ల కిందనే పాతి బెడ్తా
మాతల్లి గీ అడవి మా అందరిని
సిమ్మాల వోలె పెంచిందని
జర మరసి బోకున్డ్రి..కబర్దార్

పానాల మీద ఆస ఉంటే
గీ పక్కలకు గూడ రాకున్డ్రి
నా మాట కాతర్ సేయకుండ అస్తే
మల్లా పానలతో మీ ఇంటికోరు కొడుకో
జరంత యాది పెట్టుకోన్డ్రి

Posted in July 2024, కవితలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!