Menu Close
Kadambam Page Title

దేన్ని?

- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు

నువ్వు కోరేది రామాన్నా? కామాన్నా?
రామాన్ని కోరితే రాజువవుతావు,
కామాన్ని కోరితే కాలిపోతావు.

నువ్వు కోరేది పూర్ణాన్నా? శూన్యాన్నా?
పూర్ణాన్ని కోరితే కలిసి పోతావు,
శూన్యాన్ని కోరితే అలిసి పోతావు.

నువ్వు కోరేది మితృత్వాన్నా?శతృత్వాన్నా?
మితృత్వాన్ని కోరితే మనిషవుతావు,
శతృత్వాన్ని కోరితే మృగమౌతావు.

నువ్వు కోరేది మంచినా?చెడునా?
మంచిని కోరితే శివమౌతావు,
చెడుని కోరితే శవమౌతావు.

నువ్వు కోరేది ఆత్మీయతనా? అధికారాన్నా?
ఆత్మీయతకోరితే వరమౌతావు,
అధికారం కోరితే శాపమౌతావు.

నువ్వు కోరేది కరుణత్వాన్నా?కఠినత్వాన్నా?
కరుణత్వాన్ని కోరితే జలవౌతావు,
కఠినత్వాన్నికోరితే శిలవౌతావు.

నువ్వు కోరేది శాశ్వతాన్నా? తాత్కాలికాన్నా?
శాశ్వతాన్ని కోరితే మిగిలిపోతావు,
తాత్కాలికాన్ని కోరితే రగిలిపోతావు.

Posted in September 2018, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *