కరోనా ...
ఖజా నా....!?
ఖజా నా....!?
గేట్లు ఎత్తేసారు,
జనప్రవాహం ...
ఉప్పొంగిపోతోంది,
నాలుగుగోడలమధ్య
తడారిపోయిన
నాలుకలు ...
చైతన్యవాహికలై
అటువైపు
నదిలా ప్రవహిస్తున్నాయి!
డిమాండు
డ్రిల్ పెరేడ్ లా
సాగిపోతోంది ...
క్యూకట్టి
మద్యం మహత్తు కోసం,
తహతహ లాడిపోతోంది,
ఇన్నాళ్లు .....
బౌతిక దూరంపాటించిన
కరోనా భయం,
మందుసీసాముందు
బలాదూరైపోయింది,!
నువ్వూ - నేనూ - మనం
రేపేమౌతామో తెలీదు,
ఒకరికొకరం అంటుకుపోయి
క్వారంటైన్
కోరల్లో చిక్కుకున్నా,
ఎవరికి నష్టమైతేనేమి,
ఖజానా_
కళకళలాడితే చాలు,
రత్న వైఢూర్యాలన్నీ
ముంగిట వాలినట్టే,!
రేపటిఓటుకు ...
విలువ
మరింత పెరిగినట్టే !!
కవిత
ప్రచురించిన
సంపాదక మండలికి
ధన్యవాదాలు
_____డా.కె.ఎల్వీ.ప్రసాద్
హనం కొండ