Menu Close
చిట్టి కథలు - 3
-- దినవహి సత్యవతి --

‘అచ్చన్న!’

క్కయ్యపాలెంలో నివసించే అచ్చన్న, అమాయకుడు, అనాథ. ‘మీ దయవల్ల’ వాడి ఊతపదం.

ఊరి మునసబు బసవయ్య దగ్గరే పాలేరు అచ్చన్న. కోడి కూసీకూయగానే ఠంచనుగా పన్లోకొచ్చేస్తాడు.

దెందుకు చెయ్యాలీ, అదెందుకు చెయ్యాలీ అని అనుకోకుండా మునసబు ఇంటి పనంతా చిటికెలో చేసేస్తాడు. ప్రతి ఏటా ఘనంగా జరిగే గ్రామదేవత జాతరంటే అచ్చన్నకి మహాసంబరం.

సారి జాతరకి చుట్టుప్రక్కల ఊర్లనుంచి పెద్దెత్తున జనం తరలి వచ్చారు.

త్సాహంతో జాతరకి  వచ్చిన పరిచయస్తులందరికీ విందు ఏర్పాటు చేసాడు బసవయ్య.

ళ్ళో జాతర చూసుకుని విందు ఆరగిద్దామని బసవయ్య ఇంటికి చేరారందరూ.

న్నెన్నో రుచికరమైన వంటకాల ఘనమైన విందును సుష్టుగా ఆరగించారందరూ.

నోట విన్నా విందు కబుర్లే. భళ్ళున తెల్లవారింది.

దింటికల్లా పన్లోకొచ్చిన అచ్చన్న పెద్దలందరికీ సాష్టాంగపడ్డాడు.

కసారి అచ్చన్నని ఎగాదిగా చూసి “బాగున్నావా?” కుశలమడిగాడు బసవయ్య స్నేహితుడు కామేశం.

! మహాసక్కగున్నానయ్యా మీ దయవల్ల’”

నురా ఆమధ్య నీ పెళ్ళైందని విన్నాను. పిల్లలా?” అడిగాడు కామేశం.

అందంగా సిగ్గుపడి “మా ఇంటిది ఈమద్దెనే నీళ్ళోసుకుందండీ మీ దయవల్ల” అన్నాడు అచ్చన్న అమాయకంగా!

అః...హ...హ... పరిసరాలన్నీ నవ్వులతో ప్రతిధ్వనించాయి. కామేశం ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్క లేదు!


నన్నీ బేగం!

నాన్నమ్మ కాలంనుంచీ మా ఇంట్లో పనిచేస్తున్న, శుద్ధ అమాయకురాలైన నన్నీబేగం, పనిమనిషైనా ఇంట్లో మనిషిలా కలిసిపోయింది.

నాది నాన్నమ్మ పేరు కావడాన ఎప్పుడూ మర్యాదపూర్వకంగా పిలిచేది.

అలా వద్దని వారిస్తే “మీ నాన్నమ్మగోరు  నన్ను తోబుట్టువులా సూసేరు. ఆయమ్మ పేరే మీది. మీలో ఆయమ్మని సూసుకుంతన్నాను. పేరెట్టి పిలవలేనమ్మా” అనేది.

ఉద్యోగంలో చేరాక తనూ నాతో వస్తానంటే తీసుకొచ్చాను. వచ్చింది ఊరికే ఉండకుండా ఇంటి పనంతా అందుకుంది. అయితే, నన్నీకి అలవాటులేదని, బట్టలుతికే పని మాత్రం, వాషింగ్ మెషీన్ ఉండడాన, నేనే చూసుకుంటున్నాను.

ఓ రోజున వాష్ లో బట్టలు వేసి చిన్న పనిమీద వెళ్ళొచ్చేటప్పటికి స్పిన్ అదురుకి మెషీన్  ముందుకు కదులుతుంటే నన్నీ భయంతో కేకలు పెట్టింది.

“భయపడకు. అదీ బట్టలుతికే యంత్రం” అన్నాను.

“చోద్యం కాకపోతే బట్టలుతకడానికి యంత్రమా?” నోరెళ్ళబెట్టింది.

“ఇప్పుడు అన్ని పనులకీ యంత్రాలు వచ్చేశాయిలే”

“యంత్రమైతే కదలకుండాలి గందా మరిదేటి మడిసిలా నడుస్తాంది?”

“ఓ! అదా...” పగలబడి నవ్వి “క్రింద స్టాండు లేక వేగానికి ముందుకి కదిలివస్తోంది. అంతే” వివరించాను.

“ఓసోసి! మాయదారి యంత్రమా మాలావు భయపెట్టావుగందే!” అంటూ బుగ్గలు నొక్కుకుంది  నన్నీబేగం.


బన్నీ!

స్కూలు రజతోత్సవం నాడు, పొగ త్రాగినందువల్ల కలిగే అనర్థాలని తెలియజేసే విషయం ప్రధానాంశంగా ప్రదర్శించిన నాటికలో, ఒక పాత్ర, ఆరేళ్ళ బన్నీ వేసాడు.

నాటకం సందేశాత్మకంగా బాగుందని అందరూ ప్రశంసిస్తుంటే ఒక వ్యక్తి మాత్రం ‘ఈ నాటకం నాకు బుద్ధి చెప్పటానికే వేసారా? అందులోలాగా నా బిడ్డకీ ఏదైనా జరిగి ప్రాణం మీదకి వస్తే తట్టుకోగలనా? ఆ ఆలోచనే ఎంత భయంకరంగా ఉందీ?’ అనుకున్నాడు.

మర్నాడు ప్రొద్దునే భర్త బీడీ ప్యాకెట్లన్నీ చెత్తబుట్టలో పడేయటం చూసిన బన్నీ తల్లి, గౌరి, అతనిలో ఈ ఆకస్మిక మార్పుకి కారణం ఏమిటాని ఆలోచిస్తుంటే కొన్ని రోజుల క్రితం బన్నీ చెప్పిన విషయం గుర్తొచ్చింది...

తండ్రి బీడీ అలవాటు మాన్పించేదెలాని బాధపడుతూ బన్నీ ఉదాసీనంగా ఉండడం గమనించిన క్లాస్ టీచర్, వాడిని పిలిచి విషయం కనుక్కుని, దిగులుపడొద్దనీ తానా విషయంలో తప్పక సహాయం చేస్తానని ధైర్యం చెప్పి, బన్నీ సమస్యని, నాటకంలా వేయించి, అందరికీ మంచి సందేశాన్ని అందించారు టీచర్ అని అర్థంచేసుకుంది.

‘తండ్రిలో ఈ విధంగా మార్పు రావడానికి కారణం కొడుకే’ అనుకోగానే ప్రేమ వరదలా పొంగి రావడంతో ఆప్యాయంగా బన్నీని కౌగలించుకుంది గౌరి.

********

Posted in October 2024, కథలు

2 Comments

  1. V.V.V.Kameswari

    సత్యవతి గారూ! మీరందించిన మూడు చిట్టి కథలూ, మూడు ఆణిముత్యాలు.

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!