
చిత్ర వ్యాఖ్య
రాజు వెడలె!
వెలుగు రేడిదె కొండ మీదకు వస్తున్నా డోసరిల్లండి
జిలుగు సొబగుల వేగు చుక్కదె స్వాగతించంగ
నలుపు చీకటి మరలి చూడని పరుగు పరుగే యిక
మేలు చేసే పనుల కోసం ధీరులందరు నడుము కట్టండి!
ముగురమ్మలు!!
ఆపితివేమమ్మ నీదు వీణా నిక్వణమన హరిప్రియ లక్ష్మి ,
ఈ ఫాలాక్షమానసప్రియ అగరాజనందిని పలుకులవి
తీపి తేనెలౌట తానె ఆగె కఛ్ఛపి,ఏమి ప్రాక్పుణ్య జన్యమో
చెప్పనౌనెఈ స్నేహముశ్రీమాతతోయనె విధిప్రియ నవ్వుచున్!
***
(లలితా సహస్రం:
నిజసల్లాప మాధుర్య వినిర్భర్త్సిత కచ్ఛపీ)
శ్రీ రమణ ప్రోక్తం!
నీవు నీ వన్నది నీవు కావుర, దేహ భ్రాంతి వీడుముర
లేవెట్టి మోక్షతీర్థములు,నీ లోని "నేను" పట్టుట కంటెన్!
పాఠం!
వలచి, కొలిచినది ఆ తుహిన గిరిజ, లావణ్య సేవధి
వలదు వలదని తన పైనె ఎగ్గులు చెప్పినది మేరుధన్వి
పూల యమ్ము వేసి అగ్గి కగ్గమై యనంగుడైనది శంబరారి
తలదూర్చరాదయా ఘనుల నడుమ,నిజతనువు మిగులన్!