
చిత్ర వ్యాఖ్య
బాల ద్వయం!!
"బాల"మురళీక్రృష్ణ యను,శారద స్వరూపు డొకడు!
బాల సుబ్రహ్మణ్యమను పాట ఊటల,తేట యొకడు!
వేల వేల గీతు లాలపించిన గాన "వ్రృధ్ధు" లిర్వురు,
తలప,గళ మాధురీ చిర యశులు కారె, ధన్యతన్!
పూలసౌరు!!
సంజ కెంజాయల చూసిచూసి పుణికి పుచ్చుకున్నవో,జనని
అజగవ ధరు రాణి పద పంకజ లాలిమ లద్దుకున్నవో
ముజ్జగముల మురిపించు వేణుధరు దయ సించితమైనవో
అజుని కల్పనకళా సీమాంతము లీ లతాంతము లద్భుతమై!
సర్వదాత!
ఓయి ఏమిత్తునయ్య కర్మసాక్షీ,అన్ని
ఇచ్చినది నీవు కాగ
ఛాయానాయక ఆధివ్యాధి వినాశక
తోయతర్పణలు గాకన్!
ఏమిటో?!
తార నవ్వుల కన్విందులో చంద్ర జ్యోత్స్నల బిందువులో
గరిక చిలిపి చిందులో,మంచు ముత్యాలు పసందులై!