చిత్ర వ్యాఖ్య
ఉప్పుమూట!!
అమ్మ మూపున ఒద్దికగ చిట్టి ఉప్పు మూటయై
అమ్మ తలపుల పండిన అమృతంపు ఊటయై
అమ్మ తోటిదే లోకమై, బంగరు ఒడి లాలియై
కమ్మనై నిల్చు కాదె,బాల్య మమ్మ కంటి చలువై!
వీడెవ్వడమ్మ?!
కవ్వము తాటగట్టి చిలుకునే కాని,మువ్వల
సవ్వడి రాదు/
నవ్వుల గలగల లేమి వినరావు,వేణువును
మ్రోగదు దవు/
దవ్వులనైన, ఎంతటి రవ్వతో మరలునో నే
డనుచు,కుందె/
ఆ వైష్ణవమాయ నెరుగమి యశోద,జగత్పాలు
పట్ట జాలకన్!!
పాత్ర పోషణ!!
అత్తతో ఈ కోడలూ,అప్పాలు అరిశలూ చేయంగ,
అంతింతనీ రుచికి ఆడపడుచు,బల్కోమలాంగి!
వింతచూడంగ,గుమ్మాన పట్టీ,చిట్టేమొ,కొంగుపట్టీ
ఎంత లలితులో ఆ శ్రీ వారద్దాన మురిసిమురిసీ !
విరివర!!
పంచ దళముల నవోత్ఫుల్ల మందారమది/
పంచ విరిశరము లోటువడిన పీఠమున/
పంచాగ్నుల నడుమను తపియించిన కోమలి/
మంచుగుబ్బలి సూతికి జయ,ప్రియకారి కాదే/
(ii)
మించు కన్నుల ఱేని కొలుచు తఱి,దీని చూచి,/
చూచె స్వామి తన్నంచు,ఆ దేవి సమాదరింపన్!!