చిత్ర వ్యాఖ్య
మొదటి మ్రొక్కు!!
చల్లని చూపులు,తోరపు బొజ్జ,నిండగు విగ్రహమును
మెల్లని గజ గమనము,విఘ్నముల బాపు సుమనము
ఎల్ల విద్యల సారమా,జయకావ్య లేఖనా మహద్రయ
ముల్లముల న్చక్కగ నిలిపి,ధ్యానింపరె తొలి దేవరన్!
అభయాంజనేయ!!
అభయ ముద్రతో నిల్చినా డిదిగొ వీరాంజనేయుడు,స్వర్ణ
ప్రభల వెల్గు బల భద్ర దేహు డరిమేఘ చండ మారుతు
డుభయతారకమగు నమేయ రామనామాయుధాఢ్యు డిక
శుభమ్ముల గనరె జయమ్మని యనిలు నద్భుత పట్టికిన్!!
రామేశ్వరము!!
ఎంతగ ధ్యానించునో ఈశ్వరుని నిజ మనమున తల్లీనత
న్వింతగ కనుగవ తోచె,శివాక్రృతి ఈ దాశరథి రూపున,
అంతటి శ్రీకళాప్రభ జానకి, త్రిపుర సుందరి శివానియై!
చింతన జేసిన బుధులుచెప్పరెతొల్లిహరిహరాద్వైతమ్మున్!
ఏమి కోరక!!
దారాల హారాల నవతరించిన తొలి దేవరండి
వరాల గిరాల వేడక,నమములని తరలండి!!
(ఈ విగ్రహంలో ఏ పెయింట్ వాడబడలేదు,కేవలం పలు రంగుల దారాలతో చేయబడ్డది)