చిత్ర వ్యాఖ్య
బ్రృహదీశ్వరం వందే!!
అహో బ్రృహదీశ్వర వియన్మండల భాషిత సుగోపుర హర
విహరతు మమ హ్రృదంబరే మారహర కౌమారీ మనోవర
సుహాసకౌముదీభాస్వద్వదనశ్రీవిధుబ్రృహన్నాయకీయుత
మహాయోగి రాజాజవందిత జగద్రంజన సాంబ నిరంజనా!
వందే వాణీం!!
వాణీ బాలాం కర ధ్రృత పుస్తకాక్షమాలాం కాశ శుభ్రాం
మణివలయాలంక్రృతాం,కౌశేయ సురుచిర వసనాం
నానాశాస్త్రకళా హాటకాభరణ భాస్వద్వర గళాం
ఏణీలోచనీం హంసస్యందినీం నౌమి విద్యాస్వరూపిణీం!!
ఏనాటి పున్నెమో?!
అల వైకుంఠనాథుడా శ్రీహరి శ్రీనివాసుడై ఇల దిగిన తఱి
పాల ధారల,నలసిన ఆ దేవు నోట,కురిపించిన సురభియొ
వేలాదిమెట్ల నిట్లవలీల యెక్కి తిర్మలేశు దర్శనార్ధ మేతెంచె
ఆ లక్ష్మ్యవతారమె పతి జేరె నని భక్తావళి నమస్కరించన్!!
బాలకష్టాల్!!
గుండు చిన్నవోయె, మరి చిన్నవాని గుండె ఖిన్నమాయె
ఉండ నీయరె సుఖమున నన్నీ పెద్దలని, జాలిగన్!!
(సుఖం తెలియని పెద్దల అజ్ఞానం పట్ల జాలి)