చిత్ర వ్యాఖ్య
సరి సమానము!!
సగ మాతడట సగ మాయమ,సమాహార సుందరమై
అగడేమి లేదట, నిర్వురొక్కటే,సుసంప్రృక్త సఖ్యమై,!
బిగువుల పోయిన,ఎవరికి వారె,సగము సగమే!
ఎగయు టెత్తుల చింతన కాదె,భారతీయ మపూర్వమై!!
కంచి పరమాచార్య
(నక్షత్రపది)
నడిచిన, పలికిన దేవుడీ ఇలలో, కలిలో కనుగవ తోచిన దేవుడు/
ఒడి జేరిచి యెల్లర,యతియై లోకహితైక మతియైన స్థితప్రజ్ఞ ఘనుడు/
సడి సేయక పథ నిర్దేశియై,ఔపదేశిక హరుడై,వెల్గిన సంయమీంద్రుడు/
రూఢి,ధర్మాచరణమె ఇహపర సాధకమ్మనిన సదసద్వివేక సూర్యుడు!!
నన్నయ శైలి!
ఏలాలతా సుకుమారము
సాలంక్రృత వాక్ఛరీరము
లలితార్ధ సుగంభీరము
కులపతి రీతీ ఘనము!!
తండ్రి మాట!
రాజువు నీవన తండ్రి, అటులె యనె సువినీతమూర్తియై
రాజువు కాదు నీవన ఆ తల్లి, రాముడౌదల దాల్చె త్రృటి
నాజిన్ వాక్రుచ్చిన జనకుని మాటకై తా వెడలె కానలకు
రాజ్యశ్రీల పొంగడారణ్య క్లేశముల కృంగడు సమదర్శియై!