నేటి స్త్రీ!!
తలచుకొంటూ జరిగిన మంచిని,తనను తానే
మలచుకొంటూ,మార్పుల గొప్ప నేర్పున ఓర్చుకొంటూ ,
కలల పూల వనముల దారుల మరవనంటూ,
వెల్గు దారుల పయనమే,నా జీవన స్ఫూర్తి అంటూ!
శాంతి దీపము!
ధరను త్యాగము చేసే,కాదనె దారను యశోధరను,
సిరులొలుకు కొమరును,మౌనభిక్షువై,చిదన్వేషియై!
ధర్మ వర్తనమే మేలనే , క్రతుకర్మల, పూజల కన్న
నిర్మోహిగ,సత్త్వ శుధ్దుడయ్యే,శాక్యర్షి, ప్రశాంతవర్షియై!
లక్ష్మీ శతాక్షరి!
జయ జయ కమలాలయ ముకురానన కుటిలాలక ,సురుచిర రామే/
జయ జయ పరివేష్టిత శుభవారణ బహుకీర్తిత వర గుణ దీపే/
జయ జయ శుచి శోభిత బుధమానస చిరవాసిని, హరియుర భూషే/
జయ జయ సిత సుస్మిత విధుసోదరి శ్రిత మోదిని,స్మర శత రూపే!!
ఔర అన్నమయా!!
అన్నన్న ఓ అన్నమయ్య ఎటుల వ్రాసితివయ్య అన్ని వేల
మన్నన గల పదము లా స్వామి దర్శనము కేగు వేళల
సన్నని ముత్తెంపు టక్కరములై విభుని నుదుట తోచెనో
కన్పట్టని దివ్య ఘంటమున తానె నీ మనో ఫలకమున
రచియించెనో,నేటికి పూజా కుసుమములై,మా గ్రృహమ్ముల
నంచిత నిత్యార్చనా గీతులై వరలె మా పుణ్య మూలమ్మునన్!!