Menu Close
మనోల్లాస గేయం
- మధు బుడమగుంట -
Song

చిటపట చినుకులు

చిరు ఆశలతో జీవన పదనిసలను పలికిస్తూ ఎన్నో ఊసులు మదిలో ఆలోచనలను సృష్టిస్తూన్న తరుణంలో స్నేహితుల మధ్యన ఏర్పడుతున్న భావోద్వేగాలకు అక్షరరూపం కల్పించి గేయాన్ని రచించి, సరైన రీతిలో స్వరకల్పన చేసినప్పుడు ఇటువంటి మధురమైన పాటలు మనకు వినిపిస్తాయి.

మూడున్నర దశాబ్దాలవధిలో ఎన్నో స్ఫూర్తిదాయక గీతికలు, రసరమ్య గేయాలను తెలుగు చలనచిత్ర కళామతల్లికి అంకితం చేసిన మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి కలం నుండి వెలువడిన ఈ పాటను మీరూ ఆస్వాదించండి.

movie

ఐతే (2003)

music

సిరివెన్నెల

music

కళ్యాణి మాలిక్

microphone

ఎం.ఎం.కీరవాణి

చిటపట చినుకులు
అరచేతులలో ముత్యాలైతే ఐతే
తరగని సిరులతో తల రాతలనే
మార్చేస్తుంటే ఇట్టే ఇట్టే
అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎపుడు
ఓ వాన నువ్వొస్తానంటే
నిధులకు తలుపులు తెరవగా
మనకొక ఆలీబాబా ఉంటే
అడిగిన తరుణమే పరుగులు తీసే
అల్లావుద్దీన్ జెనీ ఉంటే
చూపదా మరి ఆ మాయదీపం
మన ఫేటే ఫ్లైటయ్యే రన్ వే

ఓ..ఓ..నడిరాత్రే వస్తావే స్వప్నమా
పగలంతా ఏం చేస్తావ్ మిత్రమా
ఊరికినే ఉఉరిస్తే న్యాయమా
సరదాగా నిజమైతే నష్టమా
మోనాలిసా మొహమ్మేదే నిలుస్తావా
ఓ చిరునామా ఇలా రావా

వేకువనే మురిపించే ఆశలు
వెనువెంటనే అంతా నిట్టూర్పులు
లోకంలో లేవా ఏ రంగులు
నలుపొకటే చూపాలా కన్నులు
ఇలాగైన ప్రతి రోజు ఎలాగైనా
ఏదో రోజు మనది రాదా
ఓ..ఓ..ఓ..ఓ..ఓ..(చిటపట)

Posted in June 2025, పాటలు