Menu Close
Kadambam Page Title
చిం(విం)తజీవులు
-- భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు --

సుఖాలు స్పందించకపోయినా దుఃఖాలనే ధరిస్తూ,
లాభాలను తలుచుకోకుండా నష్టాలనే భరిస్తూ,
శాంతి అందకపోయినా అశాంతినే శ్వాసిస్తూ,
జీతం తీసుకొని పనిమనుషులుగా జీవిస్తూ,
తమ జీవితాలను మనకు ఫణంగా పెట్టి,
మన మనుషులుగా మనని అనుక్షణం దీవిస్తూ,
పరులివ్వలేని ప్రేమానురాగాలను ప్రతిక్షణం మనకు పంచిస్తూ,
చీదరిస్తున్నా ఆదరిస్తూ,అవమానిస్తున్నా ఆశీర్వదిస్తూ,
వదిలి వెళ్ళిపోయినా మన బాగుగురించే ఆలోచిస్తూ,
అవసరాలకు వాడుకుంటున్నాఆనందంగా ఉపయోగపడుతూ,
వయసు మీదపడి అడుగులు తడబడుతున్నా,
మనసు ఖేదపడి ఆశలు పొరబడుతున్నా,
అందాల్సిన సాయం గాయం చేస్తుంటే,
నాడు తాము అందించిన ప్రేమ తిరిగి తమకు అందకున్నా,
శూన్యంతోనే ప్రతిక్షణాన్ని భాగిస్తూ,
ధైన్యంతోనే దినదినాన్ని సాగిస్తూ,
చివరికి మౌనంగానే ఈ జీవితాన్నిముగిస్తూన్న,
చిం(విం)తజీవులు అమ్మానాన్నలు.

Posted in August 2025, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *