Menu Close
ప్రకృతి వరాలు పుష్పాలు
ఆదూరి హైమావతి

బిళ్ళగన్నేరు

periwinkle flower

ఇది ఎవరి సమ్రక్షణలేకుండా పొలాల్లో మట్టి కుప్పల్లో, పల్లెల్లో పేడ దిబ్బల్లో పెరుతుంది. దీన్లో రెండు మూడు రకాల పూలుపూసే మొక్క లు ఉన్నాయి. రకరకాల పూలతో ఈ మొక్కఅన్నికాలాల్లో పెరుగుతుంది.

periwinkle flowerమన పరిసరాల్లో వాటంతట అవి పెరిగే చాలా మొక్కల్లోని విలువలు మనకు తెలీవు. ఈ మొక్కను అందరం చూసే ఉంటాం. పూలుమాత్రం అంత వాసన ఉండవు. దీన్ని సదాబహార్ అని అంటారు. ఆంగ్లంలో రోజ్ పెరివింకిల్, కేప్ పేరివింకిల్ అని అంటారు.

ఈ చిన్న మొక్క జన్మస్ధలం 'మడగాస్కర్'. దీన్ని మొదట ఐరోపా దేశస్తులు వివిధ ప్రాంతాలకు చేర వేశారు. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో దీన్ని అలంకరణకూ, మందు మొక్కగానూ పెంచుతున్నారు.

దీని శాస్త్రీయ నామము కేధరాంతస్ రోజియస్. ఇది ఎపోసైనేసి కుటుంబానికి చెందింది. ఇది ఉష్ణమండలపు మొక్క. ఇది చాలా చిన్నమొక్క. ఐనా నిండాపూలు పూస్తుంది. ఆకులు నునుపుగా మెరుస్తూ ముదురు ఆకుపచ్చగా ఉంటాయి. ఇది అన్నికాలాల్లో ఆకుపచ్చగా, రకరకాల రంగుల్లో పూలు పుస్తుంది.

పూలు తెల్లగా లేదా గులాబీ రంగులో వుండి మధ్య ముదురు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటాయి. గ్రేప్ కూలర్ అనే శీతల వాతావరణాన్ని తట్టుకుని పెరిగే తెల్లపూల పెప్పర్ మెంట్ కూలర్, ఇంకా చాలా రకాలు బిళ్ళగన్నేరు పూలుపూసే మొక్కలున్నాయి.

periwinkle flowerదీని వాసనను బట్టీ, దీనిలోని రసాయనలవల్లా పశువులు మేయవు. బిళ్ళ గన్నేరు ఎలాంటి నేలల్లోనైనా పెరుగుతుంది. నీరు కూడా ఎక్కువ అవసరంలేదు.

బిళ్ళగన్నేరు ఆకులు, వేర్లు విత్తనాలు అనేవ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి. దీన్ని ఔషధమొక్కగా పురాతన కాలం నుండీ వాడుతున్నారు. చైనా సంప్రదాయ వైద్యంలో దీని నుండి తీసిన కషాయాన్ని మలేరియా, మధుమేహం, డిమేన్షియా, వంటి వ్యాధుల నివారణలో వినియోగించేవారు. మన ఆయుర్వేదంలోకూడా పలు రకాల వ్యాధుల నియంత్రణకు ముఖ్యంగా రక్తప్రసరణ సరిచేసేందుకు వాడుతారు.

మొక్క బెరడును, ముక్కుకారడం, పంటినొప్పి, నోటిలో వచ్చే పొక్కుల నుండి ఉపశమనానికి పై పూతగా వాడతారు. ముఖ్యంగా ఈ మొక్క రక్తపోటు తగ్గించడంలో బాగా తోడ్పడుతుంది. దీనిలో ఉన్న ప్రధాన రసాయ నాలు మెదడుకు సంబంధించిన డెమేన్షియాను తగ్గించడంలో ఉపయోగిస్తారు.

రక్తనాళాల్లో అడ్దంకులను తొలగిస్తుంది. దీనిలోని రసాయనాల వలన ఇది జ్ఞాపకశక్తిని పెంచే మందుగా గుర్తింపు పొందింది. దీని రసాయన గుణాలు ఆధునిక ప్రయోగాలతో కాన్సర్ నివారణ కూడా కలిగిస్తాయని తెలుస్తున్నది. ముఖ్యంగా పిల్లల్లో వచ్చే లుకేమియా, లింఫ్ గ్రంధులకు వచ్చే లింఫోమా, వంటి కాన్సర్ల నివారణకు బాగా పనిచేస్తుందని తెలుస్తున్నది.

ఈ పూలనూ, ఆకులనూ మెత్తగా రుబ్బి జుట్టుకు పట్టించి తలంటిపోసుకుంటే తెల్లజుత్తు నల్లగా అవుతుంది.

ఈ మొక్కలో సుమారుగా 400 పైన అల్కలాయిడ్ రసాయనాలున్నాయని తెస్తున్నది. వీటిలో వింకామైన్ అనేది ప్రదానమైన ఆల్కలాయిడ్. దీనికి రక్తం గడ్డకట్టకుండా, పలుచబరిచే గుణం, జ్ఞాపక శక్తిని పెంచే గుణం ఉన్నయనీతెలుస్తున్నది.

పలురకాల మందులకు లొంగని కురుపులను కూడా దీనిలోని రసాయనాలు తగ్గిస్తాయని నిరూపితమైంది.

చూశారా మనచుట్టూ ఉండే మొక్కల్లోని మందు విలువలు. 'ఇంటి మొక్క వైద్యానికి పనికి రాదు' అన్న మాటను ధృవపరుస్తున్నట్లు మన చుట్టూ ఉండే మొక్కల గురించి మనకు తెలీకపోడం వింత అందామా? అవమానం అందామా?

Posted in January 2021, వ్యాసాలు

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!