
సంగీతం పై సాహిత్య ప్రభావం
ఛ. పింగళి నాగేంద్ర రావు
1. (చిత్రం: మాయాబజార్, సంగీతం: ఘంటసాల; పాడినవారు: ఘంటసాల, పి.లీల.) లింక్ »
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ
తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో ఒరవడిలో
తారాచంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో
పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ
అలల ఊపులో తియ్యని తలపులూ...
చెలరేగే ఈ కలకలలో మిలమిలలో
అలల ఊపులో తియ్యని తలపులూ...
చెలరేగే ఈ కలకలలో మిలమిలలో
మైమరిపించే ప్రేమ నౌకలో హాయిగ చేసే విహరనలో
లాహిరి లాహిరి లాహిరిలో
ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా
ఆ..ఆ..ఆ..ఆ
2. (చిత్రం: అప్పుచేసి పప్పుకూడు; సంగీతం: ఎస్.రాజేశ్వర రావు, పాడినవారు: ఘంటసాల, స్వర్ణలత) లింక్ »
కాశీ పోయాను రామా హరీ
గంగ తీర్దమ్ము తెచ్చాను రామా హరీ
గంగ తీర్దమ్ము తెచ్చాను రామా హరీ
కాశికి పోలేదు రామా హరీ
ఊరి కాల్వలో నీళ్ళండీ రామా హరీ
మురుగు కాల్వలో నీళ్ళండీ రామా హరీ
శ్రీశైలమెళ్ళాను రామా హరీ
శివుని వీభూది తెచ్చాను రామా హరీ
శివుని వీభూది తెచ్చాను రామా హరీ
శ్రీశైలం పోలేదు రామా హరీ
శివుని వీభూది తెలేదు రామా హరీ
ఇది కాష్టంలో బూడిద రామా హరీ
అన్నమక్కరలేదు రామా హరీ
నేను గాలి భోంచేస్తాను రామా హరీ
ఉత్త గాలి భోంచేస్తాను రామా హరీ
గాలితో పాటుగా రామా హరీ
వీరు గారెలే తింటారు రామా హరీ
నేతి గారెలే తింటారు రామా హరీ
కైలాసమెళ్ళాను రామా హరీ
శివుని కళ్ళారా చూసాను రామా హరీ
రెండు కళ్ళారా చూసాను రామా హరీ
కైలాసమెళితేను రామా హరి
నంది తన్ని పంపించాడు రామా హరి
బాగా తన్ని పంపించాడు రామా హరి
ఆలుబిడ్డలు లేరు రామా హరి
నేను ఆత్మయోగినండీ రామా హరి
గొప్ప ఆత్మయోగినండీ రామా హరి
ఆ మాట నిజమండి రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
నేను అందుకే వచ్చాను రామా హరి
3. (చిత్రం : చిత్రం: గుండమ్మ కథ, సంగీతం: ఘంటసాల; పాడినవారు: ఘంటసాల) లింక్ »
పల్లవి :
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము
నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
చరణం : 1
కదిలీ కదలని లేతపెదవుల తేనెల వానలు కురిసెనులే ఆ...
కదిలీ కదలని లేతపెదవుల తేనెల వానలు కురిసెనులే
ఆనందముతో అమృతవాహిని ఓలలాడి మైమరచితిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
చరణం : 2
ముసిముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే ఆ...
ముసిముసి నవ్వుల మోముగని నన్నేలుకొంటివని మురిసితిలే
రుసరుసలాడుచు విసిరిన వాల్జడ వలపు పాశమని బెదరితిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
తెలుపక తెలిపే అనురాగము
నీ కనులనే కనుగొంటిలే
నీ మనసు నాదనుకొంటిలే
మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే
4. (చిత్రం: గుండమ్మ కథ, సంగీతం: ఘంటసాల; పాడినవారు: ఘంటసాల) లింక్ »
పల్లవి :
ప్రేమయాత్రలకు బృందావనమూ... నందనవనమూ ఏలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా... వేరే స్వర్గము ఏలనో
అహహ అహహా...
కులుకులొలుకు చెలి చెంతనుండగా... వేరే స్వర్గము ఏలనో
ప్రేమయాత్రలకు బృందావనమూ... నందనవనమూ ఏలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము... కాశీ ప్రయాగలేలనో
ప్రేమించిన పతి ఎదుటనుండగా... వేరే దైవము ఏలనో
అహహ అహహా...
ప్రేమించిన పతి ఎదుటనుండగా... వేరే దైవము ఏలనో
తీర్థయాత్రలకు రామేశ్వరము... కాశీ ప్రయాగలేలనో
చరణం : 1
చెలి నగుమోమే చంద్రబింబమై... పగలే వెన్నెల కాయగా
అహహ అహ అహహ ఆహహ హా
చెలి నగుమోమే చంద్రబింబమై... పగలే వెన్నెల కాయగా
సఖి నెరిచూపుల చల్లదనంతో... జగమునె ఊటీశాయగా
అహహ అహహా...
సఖి నెరిచూపుల చల్లదనంతో... జగమునె ఊటీశాయగా
ప్రేమయాత్రలకు కొడెకైనాలూ కాశ్మీరాలూ ఏలనో
చరణం : 2
కన్నవారినే మరువ జేయుచూ... అన్ని ముచ్చటలు తీర్చగా
అహహ అహ అహహ ఆహహ హా
కన్నవారినే మరువ జేయుచూ... అన్ని ముచ్చటలు తీర్చగా
పతి ఆదరణే సతికి మోక్షమని... సర్వశాస్త్రములు చాటగా
అహహ అహహ హా...
పతి ఆదరణే సతికి మోక్షమని... సర్వశాస్త్రములు చాటగా
తీర్థయాత్రలకు కైలాసాలూ వైకుంఠాలూ ఏలనో
అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా
ప్రేమయాత్రలకు బృందావనవుూ... నందనవనవుూ ఏలనో
కులుకులొలుకు చెలి చెంతనుండగా... వేరే స్వర్గము ఏలనో
5. (చిత్రం: పెళ్లినాటి ప్రమాణాలు, సంగీతం: ఘంటసాల; పాడినవారు: ఘంటసాల, పి.లీల) లింక్ »
పల్లవి :
వెన్నెలలోనె వేడి ఏలనో
వేడిమిలోనె చల్లనేలనో
ఏమాయ ఏమో జాబిలీ
ఈమాయె ఏమో జాబిలీ
వెన్నెలలోనె విరహమేలనో
విరహములోనే హాయి ఏలనో
ఏమాయ ఏమో జాబిలీ
ఈ మాయె ఏమో జాబిలీ
చరణం : 1
మొన్నటికన్నా నిన్న వింతగా
నిన్నటికన్నా నేడు వింతగా
ఓహోహో ఓ ఓ ఓ... ॥మొన్నటికన్నా॥
నీ సొగసూ నీవగలూ
హాయి హాయిగా వెలసేనే ॥వెన్నెలలోనె॥
చరణం : 2
రూపముకన్నా చూపు చల్లగా
చూపులకన్నా చెలిమి కొల్లగా
ఓహోహో ఓ ఓ... ॥రూపముకన్నా॥
నీ కళలూ నీ హొయలూ
చల్ల చల్లగా విరిసెనే
వెన్నెలలోనె హాయి ఏలనో
వెన్నెలలోనె విరహమేలనో
ఏమాయ ఏమో జాబిలీ
ఈ మాయె ఏమో జాబిలీ... ఆ... ఆ... ఆ....
అదండీ, గీతకారులు, సంగీతకారులు వేరువేరైనా రాగ తానాల బరిలో దొరలి పొరలి మనల్ని ఆనంద వాహినిలో మునకలు వేయించి మ్యూజిక్ ని మేజిక్ చేసి సినిమాలలో అందమైన రంగులకలలని సృష్టించి వాటిలో పాత్రలు పాడే పాటల మాధుర్యంలో ఊయలలూగుతూ కరుణ, శృంగార, హాస్య, విషాద, రౌద్ర, ఆనందానుభవాలని పంచుకుంటూ (నాలుగు వందల ఏళ్లకు పూర్వం వాగ్గేయకారులున్న స్థితికి భిన్నంగా) సినీప్రపంచంలో అందరు రాణిస్తున్నారు.