Menu Close
GVRao
భావ లహరి
గుమ్మడిదల వేణుగోపాలరావు

సంగీతం పై సాహిత్య ప్రభావం

చ.) భువనచంద్ర

1. (చిత్రం: తొలిప్రేమ, సంగీతం: దేవా, పాడినవారు: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం) లింక్ »

పల్లవి:
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతటా ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే
జన్మించలేదా నీవు నా కోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..
గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతటా ప్రణయం ఒకటే ఒకటే

చరణం 1:
నీ కన్నుల్లో కలను అడుగు ఇతడు ఎవరని
నీ గుండెల్లో తిరిగే లయనే బదులు పలకనీ
నిదురించు యవ్వనంలో పొద్దుపొడుపై
కదిలించలేదనేనే మేలుకొలుపై
గతజన్మ జ్ఞాపకాన్నై నిన్ను పిలువ
కరగాల మంచుపొరలో ఉండగలనా

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతటా ప్రణయం ఒకటే ఒకటే

చరణం 2:
నా ఊహల్లో కదిలే కళలే ఎదుటపడినవి
నా ఊపిర్లో ఎగసే సెగలే కుదుటపడినవి
సమయాన్ని శాశ్వతంగా నిలిచిపోనీ
మమతన్న అమృతంలో మునిగిపోనీ
మనవైన ఈ క్షణాలే అక్షరాలై
మృతి లేని ప్రేమ కథగా మిగిలిపోనీ

గగనానికి ఉదయం ఒకటే
కెరటాలకి సంద్రం ఒకటే
జగమంతటా ప్రణయం ఒకటే ఒకటే
ప్రణయానికి నిలయం మనమై
యుగయుగముల పయనం మనమై
ప్రతి జన్మలో కలిశాం మనమే మనమే
జన్మించలేదా నీవు నా కోసమే
గుర్తించలేదా నన్ను నా ప్రాణమే
ప్రేమ.. ప్రేమ.. ప్రేమ.. ప్రేమ..


2. (చిత్రం: ఘటికుడు, సంగీతం: హరీష్ జైరాజ్, పాడినవారు: చిన్మయి, మేఘ, రాహుల్ నంబియార్) లింక్ »

మోగింది సన్నాయి గుండెల్లోనా ప్రేమించి వేచేటి కళ్ళల్లోనా
ఏమైందో నేడంతా ఏమైందో ఏంటో ఈ మహిమా
ఏమైందో ఏమైందో మోనాలిసా ప్రేమించీ వేచిందే నాలో ఆశా
నీతోనే నేనున్నా తాజా రోజా
నువు లేని ఓ క్షణమే అవుతోందీ ఓ యుగమే

నీకై వేచే ఒక మార్లిన్ మాన్రో నేనే
ఒళ్ళాంతా కమ్మని తేనే కౌగిట్లో చేరితి వానై
పువ్వా పువ్వా నీ మాటే నాకూ పాఠం
మనసిచ్చేయ్ మంది ప్రాయం ఒలికిందే చెలియా దేహం
ఓ..లే లే లే లే ఆశల వానై
సై సై సై సై గంధం పూసేయ్
ఓ చిరు వలనై మనసుని పరిచానే సరసకు చేరావే సిండ్రెల్లా

మోగింది సన్నాయి గుండెల్లోనా ప్రేమించి వేచేటి కళ్ళల్లోనా
ఏమైందో నేడంతా ఏమైందో ఏంటో ఈ మహిమా
ఏంటో ఈ మహిమా

నీవే నీవే ఆ జూలియట్టూ సాటీ
నీ దేహమేనా లూఠీ ఇక లేదు నీకేం పోటీ
నీవే నీవే నే హత్తుకున్నా తీగా
అరె ముద్దుపెట్టూ బాగా నా ముందుకొచ్చేయ్ బేగా
నీవే నీవే మై ఫెయిర్ లేడీ నీవే నా నా సూపర్ జోడీ
నే ప్రథమముగా రాసిన కావ్యమిదీ కవితకు ఆధారం నీవే

ఏమైందో ఏమైందో మోనాలిసా ప్రేమించీ వేచిందే నాలో ఆశా
నీతోనే నేనున్నా తాజా రోజా
నువు లేని ఓ క్షణమే అవుతోంది ఓ యుగమే
నువు లేని ఓ క్షణమే


3. (చిత్రం : హలో బ్రదర్; సంగీతం:రాజ్-కోటి , పాడినవారు: కే.ఎస్. చిత్ర, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం) లింక్ »

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా

అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా
వేకువ పూసిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనౌతా
కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని
కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ
ఓ ప్రియా...దరిచేరితే దాచుకోనా
తొలి ప్రేమలే దోచుకోనా
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా

సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించూ పదే పదే పలికించూ
వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలీ అందించూ సుఖాలలో తేలించూ
పెదవులతో కమ్మనీ కథే రాసుకోనా
ఓ ప్రియా.. పరువాలనే పంచుకోనీ
పడుచాటలే సాగిపోనీ

ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం


4. (చిత్రం: స్వయంవరం, సంగీతం: వందేమాతరం శ్రీనివాస్, పాడినవారు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం) లింక్ »

పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా
నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ
ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై
ఏ వింటి శరమో అది నీ కంటి వశమై
అంగాంగాన శృంగారాన్ని సింగారించగా
అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా
మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా
వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా
ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి
ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా
నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా
నీ చూపు తగిలి ఇక నేనుండగలనా
నా బాధ తెలిసి జత రావేమె లలనా
నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా
నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా
ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా
లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా
ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి
నీ కౌగిలి లేక తీరేదెట్టా తీపి ఆకలి
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా

### సశేషం ###

Posted in March 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!