
సంగీతం పై సాహిత్య ప్రభావం
గ. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
(చిత్రం: నీరాజనం ,సంగీతం: ఓ.పీ,నయ్యర్, పాడినవారు: ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం) లింక్ »
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
మనిషికి వలపే వరమా
మది వలపుకు వగపే ఫలమా
అది పాపమా విధి శాపమా
అది పాపమా విధి శాపమా
ఎద ఉంటే అది నేరమా
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
గుండెల దాటని మాటా
ఎద పిండిన తీయని పాటా
గుండెల దాటని మాటా
ఎద పిండిన తీయని పాటా
చరణాలుగా కరుణించునా
చరణాలుగా కరుణించునా
పల్లవిగా మరపించునా
మమతే మధురం మమతే మధురం
మరపే శిశిరం ఎదకూ విధికీ
జరిగే సమరం జరిగే సమరం
మమతే మధురం మమతే మధురం
ఘ. భాస్కరభొట్ల రవి కుమార్
(చిత్రం: జల్సా,సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, పాడినవారు: టిప్పు, సాహితి, గోపికపూర్ణిమ) లింక్ »
పల్లవి :
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
ఊర్వశివో నువ్వు రాక్షసివో నువ్వు
ప్రేయసివో నువ్వు నా కళ్ళకి
ఊపిరివో నువ్వు ఊహలవో నువ్వు
ఊయలవో నువ్వు నా మనసుకి
చరణం : 1
హే... నిదుర దాటి కలలే పొంగె
పెదవి దాటి పిలుపే పొంగె
అదుపుదాటి మనసే పొంగె... నాలో
గడపదాటి వలపే పొంగె
చెంపదాటి ఎరుపే పొంగె
నన్ను దాటి నేనే పొంగె... నీ కొంటె ఊసుల్లో
రంగులవో నువ్వు రెక్కలవో నువ్వు
దిక్కులవో నువ్వు నా ఆశకి
తుమ్మెదవో నువ్వు తుంటరివో నువ్వు
తొందరవో నువ్వు నా ఈడుకి
గాల్లో తేలినట్టుందే గుండె పేలినట్టుందే
తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే
ఒళ్ళు ఊగినట్టుందే దమ్ము లాగినట్టుందే
ఫుల్లు బాటిలెత్తి దించకుండా తాగినట్టుందే
చరణం : 2
తలపుదాటి తనువే పొంగె
సిగ్గుదాటి చనువే పొంగె
గట్టుదాటి వయసే పొంగె లోలోన
కనులుదాటి చూపే పొంగె
అడుగు దాటి పరుగే పొంగె
హద్దు దాటి హాయే పొంగె... నీ చిలిపి నవ్వుల్లో
తూరుపువో నువ్వు వేకువవో నువ్వు
సూర్యుడివో నువ్వు నా నింగికి
జాబిలివో నువ్వు వెన్నెలవో నువ్వు
తారకవో నువ్వు నా రాత్రికి
జ్ఞ. జొన్నవిత్తుల రామలింగ రావు
(చిత్రం: శ్రీ రామ రాజ్యం, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాడినవారు: అనిత, కీర్తన) లింక్ »
సీతారామ చరితం ... శ్రీ సీతారామ చరితం గానం జన్మ సఫలం ... శ్రవణం పాపహరణం
ప్రతిపదపదమును శ్రుతిలయాన్వితం
చతుర్వేదవినుతం ...లోకవిదితం
ఆదికవి వాల్మీకి రచితం ... సీతారామచరితం
కోదండపాణి ఆ దండకారణ్యమున
కొలువుండె భార్యతో నిండుగా
కోదండపాణి ఆ దండకారణ్యమున
కొలువుండె భార్యతో నిండుగా
అండదండగ తమ్ముడుండగ
కడలితల్లికి కనుల పండుగ
సుందర రాముని మోహించె రావణ సోదరి శూర్పణఖ
సుద్దులు తెలిపి పొమ్మనిన హద్దులు మీరి పైబడగా
తప్పనిసరియై లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి
అన్నా చూడని అక్కసు కక్కుచు రావణు చేరెను రక్కసి
దారుణముగ మాయ చేసె రావణుడు
మాయలేడి అయినాడు మారీచుడు
సీత కొరకు దాని వెనుక పరుగిడె శ్రీరాముడు
అదను చూసి సీతని అపహరించె రావణుడు
కడలి నడుమ లంకలోన కలికి సీతనుంచి
కరకు గుండె రాకాసుల కాపలాగ వుంచి
శోక జలధి తానైనది వైదేహి
ఆ శోక జలధిలో మునిగె దాశరధి
సీతా సీతా ... సీతా సీతా అని
సీతకి వినిపించేలా... రోదసి కంపించేలా రోదించె సీతాపతి
రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే
సీతకెందుకీ విషాదం ... రామునికేలా వియోగం
కమలనయనములు మునిగె పొంగే కన్నీటిలో
చూడలేక ఆ సూర్యుడే దూకెను మున్నీటిలో
చూడలేక సూర్యుడే దూకెను మున్నీటిలో
వానర రాజగు సుగ్రీవునితో రాముని కలిపె మారుతి
జలధిని దాటి లంకను చేరగ కనపడెనక్కడ జానకి
రాముని ఉంగరమమ్మకు ఇచ్చి రాముని మాటల ఓదార్చి
లంకను కాల్చి రయమున వచ్చి
సీత శిరోమణి రామునికిచ్చి
చూసినదంతా చేసినదంతా తెలిపె పూస గుచ్చి
వాయువేగముగ వానర సైన్యము కడలికి వారధి కట్టెరా
బాణవేగమున రామభద్రుడా రావణు తల పడకొట్టెరా
ముదమున చేరగ కులసతి సీతని దూరంగ నిలబెట్టెరా
అంత బాధ పడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు
చెంత చేర ... జగమంత చూడగా... వింత పరీక్ష విధించెను
ఎందుకు ఈ పరీక్ష .. ఎవ్వరికీ పరీక్ష
ఎందుకు ఈ పరీక్ష .. ఎవ్వరికీ పరీక్ష
శ్రీరాముని భార్యకా శీలపరీక్ష
అయోనిజకి అవనిజకా అగ్నిపరీక్ష
దశరథుని కోడలికా ధర్మపరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా
ఎవ్వరికీపరిక్ష .. ఎందుకు ఈ పరీక్ష ... శ్రీరామా
అగ్గిలోకి దూకె అవమానముతో సతి
అగ్గిలోకి దూకె అవమానముతో సతి
నిగ్గుతేలి సిగ్గుపడె సందేహపు జగతి
అగ్నిహొత్రుడే పలికె దిక్కులు మార్మోగగా
సీత మహా పతివ్రతని జగమే ప్రణమిల్లగా
లోకులందరికి సీత పునీతని చాటె మేటి శ్రీరాముడు
ఆ జానకితో అయోధ్య కేగెను సకల ధర్మసందీపుడు సీతాసమేత శ్రీరాముడు