సంగీతం పై సాహిత్య ప్రభావం
ఓ.) చంద్ర బోస్:
1. (చిత్రం: RRR, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాడినవారు: రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ) లింక్ »
పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త దూకినట్టు
పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు
కిర్రు సెప్పులేసుకుని కర్రసాము సేసినట్టు
మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు
ఎర్రజొన్న రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు
నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు నాటు పచ్చి మిరప లాగ పిచ్చ నాటు
నాటు నాటు నాటు విచ్చు కత్తి లాగ వెర్రి నాటు
గుండెలదిరిపోయేలా డండనకర మోగినట్టు
సెవులు సిల్లు పడేలా కీసు పిట్ట కూసినట్టు
ఏలు సిటికెలేసేలా యవ్వారం సాగినట్టు
కాలు సిందు తొక్కేలా దుమారం రేగినట్టు
ఒల్లు సెమటపట్టేలా వీరంగం సేసినట్టు
నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు వీర నాటు
నాటు నాటు నాటు నాటు నాటు నాటు ఊర నాటు
నాటు నాటు గడ్డపార లాగ చెడ్డ నాటు
నాటు నాటు ఉక్కపోత లాగ తిక్క నాటు
భూమి దద్దరిల్లేలా వొంటిలోని రగతమంతా రంకెలేసి
ఎగిరేలా ఏసేయరో యకాయకి నాటు నాటు
నాటో దుమ్ము దుమ్ము దులిపేలా
లోపలున్న పానమంతా దుముకు దుముకులాడేలా
దూకేయరో సరాసరి నాటు నాటు నాటో హే అది డా
నకర డా నకర డా నకర నకర నకర నకర నకర నకర నకర
2. {చిత్రం: పుష్ప, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, పాడినవారు: ఇంద్రావతి చౌహన్} లింక్ »
కోక కోక కోక కడితే కొరకొరమంటు చూస్తారు
పొట్టి పొట్టి గౌనే వేస్తే పట్టి పట్టి చూస్తారు
కోకా కాదు, గౌను కాదు కట్టులోన ఏముంది
మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే, వంకర బుద్ధి
ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా మావా,
హాయ్, ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా మావా
తెల్లా తెల్లాగుంటె ఒకడు తల్లాకిందులౌతాడు
నల్లా నల్లాగుంటె ఒకడు అల్లారల్లరి చేస్తాడు
తెలుపు నలుపు కాదు మీకు రంగుతో పనియేముంది
సందు దొరికిందంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా మావా,
హాయ్, ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా మావా
ఎత్తూ ఎత్తూగుంటే ఒకడు ఎగిరి గంతులేస్తాడు
కురసా కురసాగుంటే ఒకడు మురిసి మురిసిపోతాడు
ఎత్తూ కాదు కురసా కాదు మీకో సత్యం సెబుతాను
అందిన ద్రాక్షే తీపి మీకు మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా మావా,
హాయ్, ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా మావా
బొద్దూ బొద్దూ గుంటే ఒకడు ముద్దుగున్నావంటాడు
సన్నా సన్నంగుంటే ఒకడు సరదాపడి పోతుంటాడు
బొద్దూ కాదు సన్నం కాదు ఒంపు సొంపు కాదండి
ఒంటిగ సిక్కామంటే సాలు మీ మగ బుద్ధే వంకర బుద్ధి
ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా మావా,
హాయ్, ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా మావా
పెద్దా పెద్దా మనిషిలాగ ఒకడు ఫోజులు కొడతాడు
మంచి మంచి మనసుందంటూ ఒకడు నీతులు సెబుతాడు
మంచీ కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి
దీపాలన్నీ ఆర్పేసాకా, ఊ ఊ ఊ ఊ, దీపాలన్నీ ఆర్పేసాకా
అందరి బుద్ధి, వంకర బుద్ధే
ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా మామ
ఊ అంటామే పాప, ఊ హు అంటామా పాప
ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా,
ఊ అంటామే పాప, ఊ హు అంటామా పాప
ఊ అంటావా మావా, ఊ ఊ అంటావా మామా
3. {చిత్రం: నా ఆటోగ్రాఫ్, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాడినవారు: కే.ఎస్.చిత్ర } లింక్ »
పల్లవి:
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
చరణం 1:
దూరమెంతో ఉందనీ దిగులుపడకు నేస్తమా
దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా
భారమెంతో ఉందనీ బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వులపంట ఉంటుందిగా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చిందీ
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నదీ
కష్టాల వారధి దాటినవారికి సొంతమవుతుందీ
తెలుసుకుంటె సత్యమిదీ తలుచుకుంటె సాధ్యమిదీ
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
చరణం 2:
చెమట నీరు చిందగా నుదుటి రాత మార్చుకో
మార్చలేనిదేదీ లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతిగీత మార్చుకో
మారిపోని కధలే లేవని గమనించుకో
తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడూ
నచ్చినట్టుగా నీతలరాతను నువ్వే రాయాలీ
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో గుడి కట్టి స్వర్గాలే తరియించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలీ
అంతులేని చరితలకీ ఆది నువ్వు కావాలీ
మౌనంగానే ఎదగమనీ మొక్క నీకు చెబుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమనీ అర్ధమందులో ఉంది
అపజయాలు కలిగినచోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్ని రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది
4. (చిత్రం: ఖుషి, సంగీతం: మణిశర్మ, పాడినవారు: ఉదిత్ నారాయణ్, కవిత సుబ్రహ్మణ్యన్) లింక్ »
అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్లే మంచాన పడ్డారే ॥అమ్మాయే॥
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులు ఈ చూపులు...
ఆ నవ్వులు ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే ॥అమ్మాయే॥
ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయేలే...
ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే...
ప్రేమే తోడుంటే పామైనా తాడేలే
ప్రేమ వెంటుంటే రాయైన పరుపేలే
నీ ఒంట్లో ముచ్చమటైనా నా పాలిట పన్నీరే
నువ్విచ్చే పచ్చిమిరపూన నా నోటికి నారింజే
ఈ వయసులో ఈ వరసలో...
ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే ॥అమ్మాయే॥
నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖచిత్రం... అమ్మమ్మొ
నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్థం... అమ్మమ్మొ
ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే చేయించే తలస్నానం
ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో నీ తలపే రవికిరణం
పులకింతలే మొలకెత్తగ...
ఇది వలపుల వ్యవసాయం. ॥అమ్మాయే॥
5. (చిత్రం: బొంబాయి ప్రియుడు, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాడినవారు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, కే.ఎస్.చిత్ర) లింక్ »
మగమదనిసా సగమదనిసా..ఆ
ఓహో హిందోళం బాగుంది పాడండి పాడండి
బాలమురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోంస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే
స్వఛ్చమైన సంగీతం
ఖచ్చితంగ మాసొంతం
రాగ జీవులం నాద బ్రహ్మలం
స్వరం పదం ఇహం తరం కాగ..ఆ
బాలమురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోంస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే
తేనె పాట పాడితే మేను పులకరించదా
వీణ పాట పాడితే జాణ పరవశించదా
ఈల పాట పాడితే గాలి తాళమేయదా
జావలీలు పాడితే జాము తెల్లవారదా
భూపాళం పాడితే భూగోళం కూలదా
హిందోళం పాడితే అందోళన కలగదా
హొ హొ హొ హొ హొ హొ హొ హొ ఒ
కళ్యాణిలో పాడితే
కళ్యాణం జరగదా
శ్రీరాగం పాడితే సీమంతం తప్పదా
గురకరాళ్ళకేమి తెలుసు చిలక పలుకులూ
ఈ గార్థభాలకేమి తెలుసు గాంధర్వ గానాలూ ఆ
బాలమురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోంస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే
ఆ ...
సామగదామగ సామగదామగ సామగదామగసా
షడ్యమంలో పాడితే లోకం అంతా వూగదా
మధ్యమంలో పాడితే మత్తులోన మునగదా
గొంతు విప్పి పాడితే మంత్ర ముగ్దులవ్వరా
శ్రోతలంత బుద్దిగా వంతపాడకుందురా
ఎలుగెత్తి పాడగా
ఆకాశం అందదా
శ్రుతి పెంచి పాడగా
పాతాళం పొంగదా
హొ హొ హొ హొ హొ ఒ
అలవోకగా పాడగా
హరివిల్లే విరియదా
ఇల గొంతుతో పాడగా
చిరు జల్లే కురవదా
తేట తెలుగు పాటలమ్మ తోట పువ్వులం
మేము సందేహం అంటు లేని సంగీత సోదరులం ఆ
బాలమురళి కృష్ణ మాకు బాల్య మిత్రుడే
ఆశ భోంస్లే అక్షరాల అత్త కూతురే
గులాం అలీ అంతటోడు మాకు ఆప్తుడే
ఘంటసాల ఉండెవాడు ఇంటి ముందరే
సనిస దానీస గస నిదమగసా
తారినన్న తారినన్న తారినన్న నా
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్
నినిస గస నిస గాస నిదమసా
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్
నీ పప్పులుడవోయ్ నీకు ముప్పుతప్పదోయ్
సస్సస్సస్ససగస సస్సాగ ససగ సస్సాగ సనిదమగస గమదా మదనీ
గని సగ్గరి నిసరి దనిద మగదసా
నీదని దనిస్సా గసనిదనీ మగగ సస నిదమగ దమ్..
6. (చిత్రం: నేనున్నానని, సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాడినవారు: ఎం.ఎం.కీరవాణి, సునీత) లింక్ »
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నానని నీకేంకాదనీ నిన్నటి రాతనీ మార్చేస్తాననీ
తగిలే రాళ్లని పునాది చేసి ఎదగాలనీ
తరిమే వాళ్లని హితులుగ తలచి ముందుకెళ్లాలనీ...
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలనీ
కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలనీ
గుండెతో ధైర్యం చెప్పెను చూపుతో మార్గం చెప్పెను
అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నాననీ....
నేనున్నానని నీకేంకాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ
ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందనీ
అందరూవున్నా అప్తుడు నువ్వై చేరువయ్యావనీ
జన్మకి ఎరుగని అనురాగాన్ని పంచుతున్నాననీ
జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుతున్నాననీ
శ్వాసతో శ్వాసే చెప్పెను మనసుతో మనసే చెప్పెను
ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ ...నీకేంకాదని, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ....
చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని
ఓటమితో గెలుపే చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ నీకేం కాదనీ, నిన్నటిరాతనీ మార్చేస్తాననీ....