Menu Close
Page Title

సంగీతం పై సాహిత్య ప్రభావం

ఐ.) సి. నారాయణ రెడ్డి:

1. (చిత్రం: అమరశిల్పి జక్కన, సంగీతం: ఎస్. రాజేశ్వర రావు, పాడినవారు: ఘంటసాల) లింక్ »

ఈ నల్లని రాళ్ళలో... ఏ కన్నులు దాగెనో...
ఈ బండల మాటున... ఏ గుండెలుమ్రోగెనో...ఓ...
పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి
పాపాలకు తాపాలకు బహుదూరములో నున్నవి
మునులవోలె కారడవుల మూలలందు పడియుున్నవి
ఈ నల్లని రాళ్ళలో ...
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
కదలలేవు మెదలలేవు పెదవి విప్పి పలుకలేవు
ఉలి అలికిడి విన్నంతనే...
ఉలి అలికిడి విన్నంతనే గలగలమని పొంగిపొరలు
ఈ నల్లని రాళ్ళలో ...
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
పైన కఠినమనిపించును లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న శిలలే నయమనిపించును
ఈ నల్లని రాళ్ళలో ... ఏ కన్నులు దాగెనో...
ఈ బండల వూటున... ఏ గుండెలు మ్రోగెనో... ఓ...
ఈ నల్లని రాళ్ళలో..


2. {చిత్రం: తూర్పు పడమర, సంగీతం: రమేష్ నాయుడు, పాడినవారు: సుశీల} లింక్ »

స్వరములు ఏడైనా రాగాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో
హృదయం ఒకటైనా భావాలెన్నో
స్వరములు ఏడైనా రాగాలెన్నో

అడుగులు రెండైనా నాట్యాలెన్నో
అక్షరాలు కొన్నైనా కావ్యాలెన్నెన్నో "స్వరములు"

జననంలోన కలదు వేదన
మరణంలోను కలదు వేదన
ఆవేదనలోన ఉదయించే
నవవేదాలెన్నో, నాదాలెన్నెన్నో, నాదాలెన్నెన్నో "స్వరములు"

నేటికి రేపొక తీరని ప్రశ్న
రేపటికి మరునాడొక ప్రశ్న
కాలమనే గాలానికి చిక్కి
తేలని ప్రశ్నలు ఎన్నెన్నో, ఎన్నెన్నో

కనులున్నందుకు కలలు తప్పవు
కలలున్నపుడు పీడకలలు తప్పవు
కలల వెలుగులో కన్నీరొలికే
కలతల నీడలు ఎన్నెన్నో, ఎన్నెన్నో


3. {చిత్రం: భలే తమ్ముడు, సంగీతం: టి.వీ.రాజు, పాడినవారు: మహ్మద్ రఫీ} లింక్ »

ఎంతవారుగాని వేదాంతులైనగానీ
వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో - కైపులో – కైపులో

ఎంతవారుగాని వేదాంతులైనగానీ
వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో - కైపులో - కైపులో
హోయ్ హోయ్ చిన్నది మేనిలో మెరుపున్నది
హహ చేపలా తళుక్కన్నది
హోయ్ సైపలేకున్నది
ఏ వన్నెకాని వలపు నమ్మి వలను చిక్కునో
కైపులో - కైపులో - కైపులో

ఆడకు వయసుతో చెరలాడకు
ఆడితే వెనుకాడకు - కూడి విడిపోకు
మనసుతెలిసి, కలిసిమెలిసి, వలపునింపుకో
కైపులో - కైపులో - కైపులో

భలె భలె.... లేత వయసుబికిందిలే - తాత మనసూరిందిలే
లోకమింతేలే - అహహహ - భలె భలే
పాతరుచులు తలచితలచి తాత ఊగెనోయ్
కైపులో - కైపులో - కైపులో

ఎంతవారుగాని వేదాంతులైనగానీ
వాలుచూపు సోకగానే తేలిపోదురోయ్
కైపులో - కైపులో – కైపులో


4. (చిత్రం: కర్ణ, సంగీతం: విశ్వనాథన్ & రామమూర్తి, పాడినవారు: సుశీల) లింక్ »

గాలికి కులమేదీ
గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ
గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ
మింటికి మరుగేదీ ఏది ఏది
మింటికి మరుగేదీ ఏది
కాంతికి నెలవేదీ
గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ

పాలకు ఒకటే..ఆ..ఆ..ఆ..ఆ
పాలకు ఒకటే తెలివర్ణం ఇది ప్రతిభకు కలదా కళభేదం
వీరులకెందుకు కులభేదం
అది మనసుల చీల్చెడు మతబేధం

గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ

జగమున ఎసమే..
జగమున ఎసమే మిగులునులే అది యుగములకైనా చెదరదులే
దైవం నీలో నిలుచునులే
ధర్మం నీతో నడచునులే
ధర్మం నీతో నడచునులే

గాలికి కులమేదీ ఏది నేలకు కులమేదీ
గాలికి కులమేదీ


5. (చిత్రం: నీరాజనం, సంగీతం: ఓ.పి. నయ్యర్, పాడినవారు: ఎస్.జానకి, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం) లింక్ »

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ
ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ

క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో
అనురాగమే తల ఊపెను నీలాకాశ తీరాలలో
క్షణమాగక తనువూగెను ఈ సంధ్యా సమీరాలలో
అనురాగమే తల ఊపెను నీళాకాశ తీరాలలో

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ
ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ

కలగీతమై పులకించెను నవకళ్యాణ నాదస్వరం
కథ కానిదీ తుది లేనిది మన హృదయాల నీరాజనం
కలగీతమై పులకించెను నవకళ్యాణ నాదస్వరం
కథ కానిదీ తుది లేనిది మన హృదయాల నీరాజనం

ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ
ఘల్లు ఘల్లునా గుండె ఝల్లనా
పిల్ల ఈడు తుళ్ళిపడ్డదీ
మనసు తీరగా మాటలాడకా
మౌనం ఎందుకన్నదీ


6. (చిత్రం: ఆలాపన, సంగీతం: ఇళయరాజా, పాడినవారు: ఎస్.పీ. బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి) లింక్ »

కలిసే .... ప్రతి సంధ్యలో
కలిసే .... ప్రతి సంధ్యలో
కలిగే.... పులకింతలో
నాట్యాలన్నీ కరగాలి
నీలో నేనే మిగలాలి
కలిసే .... ప్రతి సంధ్యలో
కలిసే .... ప్రతి సంధ్యలో
పలికే ప్రతి అందెలో

పొంగిపోదా సాగరాత్మ నింగికి
చేరుకోదా చంద్రహృదయం నీటికి
పొంగిపోదా సాగరాత్మ నింగికి
చేరుకోదా చంద్రహృదయం నీటికి
సృష్టిలోన వుంది ఈ బంధమే
అల్లుకుంది నంతటా అందమే
తొణికే బిడియం తొలగాలి - వణికే అధరం పిలవాలి "కలిసే''

మేనిలోనే ఆగుతాయి ముద్రలు
గుండెదాక సాగుతాయి ముద్దులు
వింతతీపి కొంతగా పంచుకో
వెన్నలంత కళ్లలో నింపుకో
బ్రతుకే జతగా పారాలి
పరువం తీరం చేరాలి
కలిసే .... ప్రతి సందెలో
పలికే .... ప్రతి అందెలో
కలిగే.... పులకింతలో
నాట్యాలెన్నో ఎదగాలి
నీలో నేనే మిగలాలి

-సశేషం-

Posted in July 2024, సాహిత్యం

2 Comments

  1. KSrao,

    Dear sir,
    Congratulations for publishing bhava lahari during this month also,
    Thanks to Venugopal rao garu for taking so much pain in collecting the materials
    From various songs , it’s commendable job, mail.com

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!