Menu Close
Page Title

సంగీతం పై సాహిత్య ప్రభావం

ఏ.)ఆచార్య ఆత్రేయ:

1. (చిత్రం: నారీ నారీ నడుమ మురారి, సంగీతం: కే.వి.మహదేవన్, పాడినవారు: ఎస్.పి. బాలసుబ్రమణ్యం, పి.సుశీల) లింక్ »

ద్వాపరమంతా సవతుల సంతా
జ్ఞాపకముందా గోపాలా
కలియుగమందూ ఇద్దరి ముందూ
శిలవయ్యావే స్త్రీలోల
కాపురాన ఆపదలని ఈదిన శౌరీ
ఏదీ నాకూ చూపవా ఒక దారీ
నారీ నారీ నడుమ మురారీ

ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామీ
తలమునకలుగా తడిసితివా
చిరుబురులాడేటి శ్రీదేవి నీ
శిరసును వంచిన కథ విన్నా
రుసరుసలాడేటి భూదేవి నీ
పరువును తీసిన కథ విన్నా
గోవిందా..ఆ గోవిందా..ఆ గోవిందా..
సాగిందా జోడు మధ్యల సంగీతం
బాగుందా భామలిద్దరి భాగోతం

ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా
అన్నాడు ఆ యోగి వేమన
నా తరమా భవసాగర మీదనూ
అన్నాడు కంచెర్ల గోపన్న
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్
ఆ మాటను విని ముంచకు స్వామీ గంగన్
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే
సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా

భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా
అన్నాడు ఆ నంది తిమ్మనా
ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని
అన్నాడు సాకేత రామన్న
ఎధునాథా భామ విడుము రుక్మిణి చాలున్
రఘునాథా సీతను గొని విడు శూర్పనఖన్
రాసలీలలాడాలని నాకు లేదులే
భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే
ఇరువురు భామల కౌగిలిలో స్వామి
ఇరుకున పడి నీవు నలిగితివా
వలపుల వానల జల్లులలో స్వామీ
తలమునకలుగా తడిసితివా
గోవిందా..ఆ గోవిందా..ఆ గోవిందా


2. {చిత్రం: గుప్పెడు మనసు, సంగీతం: ఎం.ఎస్.విశ్వనాథన్, పాడినవారు: ఎం. బాలమురళి కృష్ణ} లింక్ »

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా

చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో

కోర్కెల సెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల దెయ్యానివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

మౌనమే నీ భాష ఓ మూగ మనసా
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
తలపులు ఎన్నెన్నో కలలుగా కంటావు
కల్లలు కాగానే కన్నీరౌతావు
మౌనమే నీ భాష ఓ మూగ మనసా
ఓ మూగ మనసా


3. {చిత్రం: ఆత్మబలం, సంగీతం: కే.వీ. మహదేవన్, పాడినవారు: ఘంటసాల, సుశీల} లింక్ »

చిటపట చినుకులు పడుతూ ఉంటే..చెలికాడే సరసన ఉంటే..
చెట్టా పట్టగ చేతులు కలిపీ.. చెట్టు నీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్

ఉరుములు పెళ పెళ ఉరుముతు ఉంటే
మెరుపులు తళ తళ మెరుస్తూ ఉంటే
మెరుపు వెలుగులో ..చెలి కన్నులలొ.. బిత్తర చూపులు కనబడుతుంటే..
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్

కారుమబ్బులు కమ్ముతు ఉంటే..
కమ్ముతు ఉంటే..
ఓ ఓ ఓ కళ్ళకు ఎవరూ కనబడకుంటే..
కనబడకుంటే..

జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే..
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే..

చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్

చలి చలిగా గిలివేస్తుంటే..
గిలిగింతలు పెడుతూ ఉంటే..

చెలి గుండియలో రగిలే వగలే.. చలిమంటలుగా అనుకుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్


4. (చిత్రం: రాజకుమార్, సంగీతం: ఇళయరాజా, పాడినవారు: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుశీల) లింక్ »

జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..
ఆనాడు ఎవరూ అనుకోనిది..ఈనాడు మనకు నిజమైనది..
ఆ రామాయణం..మన జీవన పారాయణం!!

చెలి మనసే శివధనుసైనది..తొలిచూపుల వశమైనది..
వలపు స్వయంవరమైనప్పుడు..గెలువనిది ఏది?
ఒక బాణము ఒక భార్యన్నది..శ్రీరాముని స్థిరయశమైనది..
శ్రీవారు ఆ వరమిస్తే..సిరులన్నీ నావి!!

తొలి చుక్కవు నీవే..చుక్కానివి నీవే!!
తుది దాకా నీవే..మరుజన్మకు నీవే!!
సహవాసం మనకు నివాసం.. సరిహద్దు నీలాకాశం..
ప్రతి పొద్దు ప్రణయావేశం.. పెదవులపై హాసం..
సుమసారం మన సంసారం..మణిహారం మన మమకారం..
ప్రతీ రోజు ఒక శ్రీకారం.. పరవశ శృంగారం

గతమంటే నీవే..కథకానిది నీవే!!
కలలన్నీ నావే..కలకాలం నీవే!!

రాముడు అనుకోలేదు జానకి పతి కాగలనని ఆనాడు..
జానకి కలగనలేదు రాముని సతి కాగలనని ఏనాడు..
ఆనాడు ఎవరూ అనుకోనిది..ఈనాడు మనకు నిజమైనది..
ఆ రామాయణం..మన జీవన పారాయణం!!


5. (చిత్రం: తోడికోడళ్లు, సంగీతం, పాడినవారు: ఘంటసాల) లింక్ »

కారులో షికారు కెళ్ళే
పాలబుగ్గల పసిడి చానా
బుగ్గలమీద గులాబి రంగు
ఎలా వచ్చెనో చెప్పగలవా
నిన్ను మించిన కన్నెలెందరో
మండుటెండలో మాడుతుంటే
వారి బుగ్గల నిగ్గు నీకు
వచ్చి చేరెను తెలుసుకో
కారులో షికారు కెళ్ళే
పాలబుగ్గల పసిడి దానా
నిలిచి విను నీ బడాయి చాలు
తెలుసుకో ఈ నిజా నిజాలు

చలువ రాతి మేడలోన
కులుకుతావే కుర్రదానా
మేడకట్టిన చలువరాయి
ఎలా వచ్చెనో చెప్పగలవా
కడుపు కాలే కష్టజీవులు
ఒడలు విరిచి గనులు తొలిచి
చెమట చలువను చేర్చి రాళ్ళను పేర్చినారు తెలుసుకో "కారులో షికారు"

గాలిలోనా తేలిపోయే చీరకట్టిన చిన్నదానా
జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా
చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు
చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింక తెలుసుకో "కారులో షికారు"


6. (చిత్రం: బావామరదళ్లు, సంగీతం: ఏ.ఎం.రాజా, పాడినవారు: జిక్కి) లింక్ »

పులకించని మది పులకించు
వినిపించని కథ వినిపించు
కనిపించని ఆశలనించు
మనసునే మరపించు
గానం మనసునే మరపించు ॥పులకించని॥

రాగమందనురాగమొలికి రక్తినొసగును గానం
రేపురేపను తీపి కలలకు రూపమిచ్చును గానం
చెదరిపోయే భావములను చేర్చిగూర్చును గానం
జీవమొసగును గానం...మది చింతబాపును గానం...

వాడిపోయిన పైరులైనా నీరుగని నర్తించును
కూలిపోయిన తీగలైనా కొమ్మనలమీ ప్రాకునూ
కన్నెమనసు ఎన్నుకొన్న తోడు దొరికిన మురియు
దోరవలపే కురియు మదిదోచుకొమ్మని పిలుచు
ప్రేమ మనసునే మరపించు


7. (చిత్రం: నీరాజనం, సంగీతం: ఓ.పి.నయ్యర్, గానం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం) లింక్ »

మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం

మరచిన మమతొకటీ
మరి మరి పిలిచినదీ
మరచిన మమతొకటీ
మరి మరి పిలిచినదీ
ఒకతీయనీ పరితాపమై
ఒకతీయనీ పరితాపమై
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం

తొలకరి వలపొకటీ
అలపుల తొలచినదీ
తొలకరి వలపొకటీ
అలపుల తొలచినదీ
గత జన్మలా అనుబందమై
గత జన్మలా అనుబందమై

మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం
పగిలే వరకే అది నిత్యసుందరం
మనసొక మధుకలశం


8. (చిత్రం: మూగమనసులు , సంగీతం: కే.వీ. మహాదేవన్, పాడినవారు: పి. .సుశీల) లింక్ »

మానూ మాకును కాను _ రాయీ రప్పను కానే కాను
మామూలు మనిషిని నేను _ నీ మనిషిని నేను
నాకూ ఒక మనసున్నాదీ, నలుగురిలా ఆశున్నాదీ
కలలు కనే కళ్ళున్నాయి, అవి కలత పడితె నీళ్ళున్నాయి ||మానూ||
పెమిదను తెచ్చీ వొత్తినియేసీ, సమురును పోసీ బెమసూపేవా
ఇంతా శేసి యెలిగించేందుకు, ఎనకముందు లాడేవా ||మానూ||
మణిసి తోటి యేళాకోళం, ఆడుకుంటే బాగుంటాది
మనసు తోటి ఆడకు మావా,ఇరిగి పోతే అతకదుమల్లా ||మానూ||

-సశేషం-

Posted in June 2024, సాహిత్యం

Leave a Reply

సిరిమల్లెకు మీకు స్వాగతం! మీ స్పందనకు ధన్యవాదాలు. త్వరలోనే ప్రచురించబడుతుంది!!