సంగీతం పై సాహిత్య ప్రభావం
ఉ.) ఆరుద్ర:
1. (చిత్రం: గోరంత దీపం, సంగీతం: కే.వీ.మహదేవన్, పాడినవారు: సుశీల) లింక్ »
రాయినైన కాకపోతిని రామపాదము సోకగా.
బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ..
కడవనైన కాకపోతిని స్వామికార్యము తీర్చగ..
పాదుకైన కాకపోతిని భక్తిరాజ్యమునేలగ..
అడవిలోపల పక్షినైతే అతివ సీతను కాచనా..
అందువలనా రామచంద్రుని అమిత కరుణను నోచనా..
కడలి గట్టున ఉడతనైతే బుడత సాయము చేయన..
కాలమెల్ల రామభద్రుని నీలిగురుతులు మోయన రాయినైన కాకపోతిని రామపాదము
కాకినైన కాకపోతిని ఘాతుకమ్మును చేయుచూ..
గడ్డీ పోచను శరముచెసి ఘనత రాముడు చూపగ..
మహిని అల్పజీవులే ఈ మహిమలన్ని నోచగ..
మనిషినై జన్మించినాను మత్సరమ్ములు రేపగ.. మదమత్సరమ్ములు రేపగ...
రాయినైన కాకపోతిని రామపాదము సోకగ.. బోయనైన కాకపోతిని పుణ్యచరితము పాడగ..
2. {చిత్రం: బావమరదళ్ళు, సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు, పాడినవారు: ఎస్ .జానకి} లింక్ »
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళ
ఏ పూర్వ పుణ్యమో నీ పొందుగా మారి
అపురూపమై నిలచే నా అంతరంగాన
నీ చెలిమిలోనున్న నెత్తావి మాధురులు
నా హృదయ భారమునే మరపింపజేయు
అందుకోజాలని ఆనందమే నీవు
ఎందుకో చేరువై దూరమౌతావు
నీలి మేఘాలలో గాలి కెరటాలలో
నీవు పాడే పాట వినిపించునీ వేళ
3. {చిత్రం: మిస్టర్ పెళ్ళాం, సంగీతం: ఎం.ఎం. కీరవాణి, పాట: కే.ఏస్. చిత్ర, ఏస్.పి.బాలసుబ్రహ్మణ్యం} లింక్ »
సొగసు చూడ తరమ హ హ హ సొగసు చూడ తరమ
నీ ఆప సోపాలు నీ తీపి శాపాలు యెర్రాని కోపాలు ఎన్నెల్లో
దీపాల అందమె సుమా సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమా
అరుగు మీద నిలబడి నీ కురులను దువ్వే వేళా
చేజారిన దువ్వెన్నకు బేజారుగా వంగి నప్పుడు
చిరు చీర గట్టి సిగ్గును చెంగున కోపం దాచి బగ్గు మన్న చక్కదనం
పరుగో పరుగెత్తి నప్పుడు ఆ సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమా
పెట్టి పెట్టని ముద్దులు యిట్టె విదిలించి కొట్టి గుమ్మెతే సోయగాల గుమ్మలను దాటు వేళా
చెంగు పట్టి ర రమ్మని చలగాటకు దిగుతుంటే
తడి బారిన కన్నులతో వీడు వీడు అంటున్నప్పుడు
ప్లీజ్ ప్లీజ్ వదలండి ఉమ్మ్ వీడు వీడు అంటున్నప్పుడు
ఆ సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమా
ఆ ఆ ఆ పసిపాపకు పాలిస్తూ పరవశించి వున్నప్పుడు ఉమ్మ్ హ్మ్
పెద్ద పాపడు పాకివచ్చి మరి నాకో అన్నప్పుడు
మొట్టి కాయ వేసి చి పోండి అన్నప్పుడు
నా ఏడుపూ నీ నవ్వులు హరివిల్లై వెలిసి నప్పుడు
ఆ సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమా
సిరి మల్లెలు హరి నీలపు జడలో తురిమి క్షణమే యుగమై వేచి వేచి
చలి పొంగులు తొలి కోకాల ముడిలో అదిమి అలసి సొలసి కన్నులు వాచీ
నిట్టూర్పుల నిసి రాత్రి లో నిద్దరోవు అందాలతో
త్యాగరాజ కృతిలో సీతాకృతి గల ఇటువంటి
సొగసు చూడ తరమ నీ సొగసు చూడ తరమా!!
ఉ.) ఆరుద్ర:
1. (చిత్రం: అన్నమయ్య, సంగీతం: కోడూరి మరకతమణి కీరవాణి, పాడినవారు: సుజాత మోహన్, ఎస్ .పి. బాలసుబ్రహణ్యం) లింక్ »
తెలుగు పదానికి జన్మదినం
ఇది జాన పదానికి జ్ఞానప్రదం
ఏడూ స్వరాలే ఏడూ కొండలై వెలసిన
కలియుగ విష్ణు పదం అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం, ఇది అన్నమయ్య జననం
అరిషడ్వర్గము తెగనరికే హరిఖడ్గంమిది
నందకము బ్రహ్మలోకమున బ్రహ్మభారతి
నాదాశీస్సులు పొందినదై శివలోకమ్మున
చిద్విలాసమున ఢమరుధ్వనిలో గామాకితమై
దివ్యసభలలో నవ్యలాస్యముల
పూబంతుల చేబంతిగా ఎగసి
నీరద మండల నారద తుంబుర మహతి
గానవు మహిమలు తెలిసి శితహిమ కంధర
యతిరాత్సభలో తపః ఫలముగా తళుక్కుమని
తల్లి తనముకై తల్లడిల్లు ఆ లక్క మాంబ
గర్భాలయములో ప్రవేశించే ఆనందకము
నందనానంద కారకము అన్నమయ్య జననం
ఇది అన్నమయ్య జననం ఇది అన్నమయ్య జననం
పద్మావతియే పురుడు పోయగా పధ్మాసానుడే ఉసురు పోయగా
విష్ణు తేజమై నాద బీజమై ఆంధ్ర సాహితి అమర కోశమై
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
అవతరించెను అన్నమయ్య అసతోమా సద్గమయ
పాపడుగా నట్టింట పాకుతూ భాగవతము చెప్పట్టేనయా
హరినామమ్మును ఆలకించక అరాముద్దలనే ముట్టడియా
తెలుగు భారతికి వెలుగు హారతాయి
ఎదలయలో పద కవితలు కలయ
తాళ్లపాకలో ఎదిగే అన్నమయ్య
తమసోమా జ్యోతిర్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
తమసోమా జ్యోతిర్గమయా
2. (చిత్రం: సప్తపది, సంగీతం: కే.వీ.మహదేవన్ , పాడినవారు: సుశీల,ఎస్ .పి. బాలసుబ్రహణ్యం) లింక్ »
రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి
ఆ నందన మురళి ఇదేనా
రేపల్లియ ఎద ఝల్లున పొంగిన రవళి
నవరస మురళి
ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మోహన మురళి
ఇదేనా ఆ మురళి
కాళింది మడుగున కాళీయుని పడగల
ఆబాల గోపాల మాబాల గోపాలుని
అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులజూడ
తాండవమాడిన సరళి
గుండెలనూదిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి
మరులే కురిపించి
అనగల రాగమై తొలుత వీనులలరించి
అనలేని రాగమై మరలా వినిపించి
మరులే కురిపించి
జీవనరాగమై బృందావన గీతమై
ఆ జీవనరాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల
వెన్నెల దోచిన మురళి ఇదేనా
ఇదేనా ఆ మురళి
ఆ వేణుగాన లోలుని మురుపించిన రవళి
నటనల సరళి ఆ నందన మురళి
ఇదేనా ఆ మురళి మువ్వల మురళి
ఇదేనా ఆ మురళి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
మధురా నగరిలో యమునా లహరిలో
ఆ రాధ ఆరాధనాగీతి పలికించి
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
సంగీత నాట్యాల సంగమ సుఖవేణువై
రాసలీలకే ఊపిరిపోసిన
అందెల రవళి ఇదేనా
ఇదేనా ఆ మురళి
3. (చిత్రం: అన్నమయ్య, సంగీతం : కోడూరి మరకతమణి కీరవాణి , పాడినవారు: మనో, కె.ఎస్. చిత్ర) లింక్ »
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
వలపే ఇటు దులిపే చెలి వయ్యారంగా కధలే
ఇక నడిపే కాడు శృంగారంగా పెనుగొండ
ఎద నిండా రగిలింది వెన్నెల హలా
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే
భంగా రంగరించు సంగమాలు భంగ భంగారే
భంగా సపమా సామగా సాగసానిపస సపమా
సామగా సాగసానిపస మామిని పాసనిస నీపని
నీ చాటు పని రాసలీలా లాడుకున్న రాజసాల పని
మా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు
కోరు పని ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆపని రేపని
మారిమాపని క్షణమాపని మాపని
ప ప ప పని ప ని స గ స ని పని మా మా మా మని
మాపని ఆ పని ఎదో ఇపుడే తెలుపని వలపన్ని
అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
ఓ సఖి రికెందు ముఖి ముద్దులాడు యుద్ధరంగానా ముఖాముఖి
ఓ సఖ మదనువిజానక ఈ సందిట కుదరాలి మనకు
సందియిక బూతువున కొకరుచి మరిగిన మన సయ్యాట కి
మాటికీ మొగమాటపు సగమాటలు ఏటికి
ప ప ప పని ప ని స గ స ని పని మా మా మా మా మని మాపని
పెళ్ళికి పల్లకి తెచ్చే వరసకి వయసుకి అస్మదీయ మగతిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా రంగరించు సంగమాలు భంగ భంగారే భంగా
4. (చిత్రం: చూడాలని ఉంది, సంగీతం: మణిశర్మ, పాడినవారు: హరిహరన్ ) లింక్ »
యమహా నగరి కలకత్తా పురి
యమహా నగరి కలకత్తా పురి
నమహో హుగిలి హౌరాహ్ వారది
యమహా నగరి కలకత్తా పురి
చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను
మరి చిరు త్యాగ రాజు నీ కృతిని పలికెను
హుగిలి హౌరాహ్ వారాది నేతాజీ పుటిన చోట
గీతాంజలి పూసిన చోట పాడనా తెలుగులో ఆ హంస పాడిన పాటే
ఆ నందుడు చూపిన బాట సాగనా
పదుగురు పరుగు తీసింది పట్నం బ్రతుకుతో
వెయ్యి పందెం కడకు చేరాలి గమ్యం కధీలి పోరా
ఒకరితో ఒకరికి ముఖపరిచేయములు దొరకని క్షణముల
బిజీ బిజీ బ్రతుకుల గజి బిజీ ఉరుకుల పరుగులతో –యమహా నగరి కలకత్తా పూరి
బెంగాలీ కోకిల బాల తెలుగింటి కోడలు పిల్ల మాలిని సరోజినీ
రోజంతా సూర్యుడు కింద రాత్రంతా రజిని కందా
సాగని పదుగురు ప్రేమ లేలేని లోకం
దేవతమార్కు మైకం శరన్నవలాభిషేకం
తెలుసుకోరా కధలకు నేలవాట కాలాలకు
కొలువుట తిదులకు సెలవట అతిధుల గొడవట
కలకత్తా నగరపు కిట కిటలో -యమహా నగరి కలకత్తా పురి
వందేమాతరమే అన్న వంగా భూతలమే మిన్న జాతికే గీతిరా
మాతంగి కాళీ నిలయ చౌరంగీ రంగుల దునియా నీదిరా
వినుగురు సత్యజిత్రే సితార ఎస్ టి బర్మన్ కి దార తెరెసా కి కుమార కదలి రారా
జనగనమనముల స్వరపడ వనముల హృదయపు లయలను
శృతి పరచిన ప్రియా సుఖ పీక ముఖ సుఖ రవళులతో- యమహా నగరి కలకత్తా పురి
5. (చిత్రం: అడవి రాముడు, సంగీతం : కే.వీ. మహదేవన్ , పాడినవారు: ఎస్పీ. బాలసుబ్రహ్మణ్యం) లింక్ »
సాకీ :
మనిషై పుట్టినవాడు కారాదు మట్టిబొమ్మ
పట్టుదలే ఉంటే కాగలడు మరోబ్రహ్మ
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారుమహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
అడుగో అతడే వాల్మీకి బ్రతుకు వేట అతనికి
అతిభయంకరుడు యమకింకరుడు
అడవి జంతులపాలిటి అడుగో అతడే వాల్మీకి
పాలపిట్టల జంట వలపు తేనెల పంట
పండించుకుని పరవశించి పోయేవేళ
ఆ పక్షుల జంటకు గురిపెట్టాడు
ఒక పక్షిని నేల కూల్చాడు
జంట బాసిన పక్షి కంట పొంగిన గంగ
తన కంటిలో పొంగ మనసు కరగంగ
ఆ శోకంలో ఒక శ్లోకం పలికే ఆ చీకటి ఎదలో దీపం వెలిగే
కరకు బోయడే అంతరించగా కవిగా ఆతడు అవతరించగా
మనిషి అతనిలో మేల్కొన్నాడు కడకు మహర్షే అయినాడు
నవరసభరితం రాముని చరితం జగతికి ఆతడు పంచిన అమృతం
ఆ వాల్మీకి మీవాడు మీలోనే ఉన్నాడు
అక్షరమై మీ మనసు వెలిగితే మీలోనే ఉంటాడు
అందుకే...
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
ఏకలవ్యుడంటేనే ఎదురులేని బాణం
తిరుగులేని దీక్షకీ అతడే ప్రాణం
కులం తక్కువ ని విద్యనేర్పని గురువు బొమ్మగా మిగిలాడు
బొమ్మ గురువుగా చేసుకొని బాణ విద్యలో పెరిగాడు
హుటాహుటిని ద్రోణుడపుడు తటాలుమని తరలివచ్చి
పక్షపాత బుద్ధితో దక్షిణ ఇమ్మన్నాడు
ఎదుట నిలిచిన గురుని పదమంటి
ఏమివ్వగలవాడననే ఏకలవ్యుడు
బొటనవ్రేలివ్వమనె కపటి ఆ ద్రోణుడు
వల్లెయనె శిష్యుడు చెల్లె ద్రోణుని ముడుపు
ఎరుకలవాడు అయితేనేమి గురికల వాడే మొనగాడు
వేలునిచ్చి తన విల్లును విడిచి
వేలుపుగా ఇల వెలిగాడు
అందుకే...
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
శబరీ... ఇంతకాలము వేచినది ఈ పిలుపుకే శబరి
ఆశ కరువిడి అడుగు తడబడి రామపాదము కన్నది
వంగిపోయిన నడుముతో నగుమోము చూడగలేక అపుడు
కనుల నీరిడి ఆ రామపాదము కడిగినది శబరి
పదముల ఒరిగినది శబరి
ప్రేమ మీరగ రాముడప్పుడు శబరి తల్లి కనులు తుడిచి
కోరికోరి శబరి కొరికిన దోర పండ్లను ఆరగించె
ఆమె ఎంగిలి గంగ కన్న మిన్నగ భావించిన
రఘురాముడెంతటి ధన్యుడో
ఆ శబరిదెంతటి పుణ్యమో
ఆమె ఎవ్వరో కాదు సుమా ఆడబడుచు మీ జాతికి
జాతిరత్నములు ఎందరెందరో మీలో కలరీ నాటికీ
అడివిని పుట్టి పెరిగిన కథలే అఖిల భారతికి హారతులు
నాగరికతలో సాగు చరితలో మీరే మాకు సారథులు
అందుకే...
కృషి ఉంటే మనుషులు ఋషులౌతారు మహాపురుషులౌతారు
తరతరాలకి తరగని వెలుగౌతారు ఇలవేలుపులౌతారు
6. (చిత్రం: రావణుడే రాముడైతే, సంగీతం: జి.కే. వెంకటేష్, పాడినవారు : ఎస్ .పి. బాలసుబ్రహ్మణ్యం) లింక్ »
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడనీ .. పాడని నవ్య నాదానివో
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఏ రాగమో తీగ దాటి ఒంటిగా నిలిచే ఏ యోగమో
నన్ను దాటి జంటగా పిలిచే
ఏ మూగభావలో అనురాగ యోగాలై.. నీ పాటలే పాడని
రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఏ గగనమో కురుల జారి నీలిమై పోయే ఏ ఉదయమో
నుదుట చేరి కుంకుమై పోయే ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
కదలాడని ఆడాని రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
రవి చూడని పాడని నవ్య నాదానివో రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
7. (చిత్రం: శంకరాభరణం, సంగీతం: కే.వీ. మహాదేవన్, పాడినవారు: ఎస్.పి. బాలు, ఎస్.జానకి) లింక్ »
ప: ఓం ఓం ఓంకార నాదాను
సంధానమౌ గానమే శంకరాభరణము
శంకర గళ నిగళము శ్రీహరి పద కమలము
రాగ రత్న మాలికా తరళము శంకరాభరణము
చ: శారద వీణా రాగ చంద్రికా పులకిత శారద రాత్రము
నారద నీరద మహతీ నినాద గమకిత శ్రావణ గీతము
రసికుల కనురాగమై రస గంగలో తానమై
పల్లవించు సామ వేద మత్రము శంకరాభరణము
చ: అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము....
సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణము
త్యాగ రాజ హృదయమై రాగ రాజ నిలయమై
ముక్తి నొసగు భక్తి యోగ మార్గము
మృతియె లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము
ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము
పాదాని శంకరాభరణము
పమగరీ, గమపదని శంకరాభరణము
సరిసా, నిదపా, నిసనీ, దపమా, గరిగా, పమగా పమద
పనిద సనిగరి శంకరాభరణము
దపా, దమా, మా పాదపా
మా పా ద పా
దపా, దమా, మదపామగా
మా ద పా మ గా
గమమద దనినిరి మదదని నిరిరిగ
నిరిరిగ గమమగ, సరిరిస సనినిదదప శంకరాభరణము
రీససాస రిరిసాస రీసాస సనిస రీససని రిసని దనీనీనీ
దాదానీని దదనీని దానీని దనిస దనిసద నిసదని దగరిసాని
దస దా దా దా
గరిగా మమగా గరిగా మమగా గరిగమస గామపద
మదసమ గరిసరి
సరిగసరీ గరిమగపమ దప మగప దపనిద పమదప
నిదసని
రిసగరిసా గరిసనిద రీసా రిసనిదప సా
గరిసనిద రిసనిదప సనిదపమ రీసానీ రిసనిదప నీదా
సనిద పమపా రిసనిదప సనిదపమ దపమగరి గామాదా
నిదని పదమాప రిసనిదప రీ దపమగరీ
రిసని దప మగరిసని శంకరాభరణము... శంకరాభరణమూ
8. (చిత్రం: అల వైకుంఠపురంలో, సంగీతం: తమన్, పాడినవారు: సిద్ శ్రీరామ్) లింక్ »
నీ కాళ్లన్ని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనళ్ళ తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు
నీ కళ్ళకి కావలి కాస్తాయే కాటుకల నా కళలు
నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు
నా ఊపిరి గాలికి ఉయ్యాలలా ఊగుతూ ఉంటె ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టూర్చవట్టె నిష్టూరపు విలవిలలు
సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా
నీ కాళ్లన్ని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు
ఆ చూపులనాళ్ళ తొక్కుకు వెళ్ళాక దయలేదా అసలు
మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురు పడిన వెన్నెల వనమా
విరిసిన పించేమా వీరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నగ వశమా
అరేయ్ నా గాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా
ఎంతో బ్రతిమాలినా ఇంతేనా అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా
సామజవరగమనా నిను చూసి ఆగ గలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్ప తగునా సామజవరగమనా నిను చూసి ఆగ గలనా
9. (చిత్రం: చక్రం, సంగీతం: చక్రి, పాడినవారు : శ్రీ కొమ్మినేని) లింక్ »
జగమంతా కుటుంబం నాది
ఏకాకి జీవితం నాది జగమంతా కుటుం
బం నాది ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే
సన్యాసం సూన్యం నావే జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
కవినై కవితానై, భార్యనై భర్తనై -కవినై కవితానై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో- మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాలా కన్నీటి జలపాతాల
నాతొ నేను అనుగమిస్తూ నాతొ నేనే రమిస్తూ
వంటరినై అనవరతం కంటున్నాను
నిరంతరం కలల్ని కధల్ని మాటల్ని పాటల్ని
రంగుల్నీ రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లల్ని
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై -మింటికి కంటిని నేనై కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై వెన్నెల కూతలా మంటను నేనై
రవినై ససినై దివమై నిషినై నాతొ నేను సహగమిస్తూ నాతొ నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను-
నిరంతరం కిరణాల్ని కిరణాల హరిణాల్ని
హరిణాల చరణాల్ని చరణాల చలనాన కానరాని గమ్యాల కాలాన్ని
ఇంద్ర జాలాన్ని జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
గాలి పల్లకీలోన తరలి నా పాటా
పాప ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తాను మూగబోయి
నా గుండె మిగిలే నా హృదయమే నా లోగిలి నా హృదయమే
నా పాటకి తల్లి నా హృదయమే నాకు ఆలీ నా హృదయములో
ఇది సినివాళి జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
జగమంతా కుటుంబం నాది ఏకాకి జీవితం నాది
⭐⭐⭐⭐⭐