ఆత్మ గురించి కొన్ని విషయాలు:
ఆత్మ గురించి తెలియజేసేదే ఆధ్యాత్మికత
ఆత్మ నిరాకారం, నిరంజనం, నిర్గుణం
ఆత్మ స్థూల జగత్తుకు, విశ్వమంతుడికి ఆధారం
ఆత్మ ఉన్నది అనడానికి ఎటువంటి ఆధారం లేదు
ఆత్మ లేదు అని వ్యతిరేకించలేం.....త్రోసిపుచ్చలేం
ఆత్మ సర్వత్రా, అంతటా, అన్నింటా వ్యాపించి ఉంటుంది
ఆత్మకు ఎటువంటి ఆధారం ఉండదు
ఆత్మను గురించి తెలుసుకోవడమే జీవిత పరమార్ధం
ఆత్మ అనేది సృష్టికర్త ....సృష్టి అంతటికి మూలం
ఆత్మ అనేది అనాత్మ. అంతటా వ్యాపించి ఉంటుంది
ఆత్మ గురించి అవగాహన లేకపోతే జీవితం వ్యర్థం
ఆత్మను స్ప్రజించలేo, దహించలేం, విభజించలేం
ఆత్మ విశ్వంలో అత్యంత ఎక్కువగా వ్యాపించి ఉంటుంది
ఆత్మ అనేది అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమై ఉంటుంది
ఆత్మ అంటే భగవంతుడు, శుద్ధ చైతన్యం లేక పరబ్రహ్మం
ఆత్మ అనంతం, సర్వస్వం మరియు పరిపూర్ణం
ఆత్మకు సంబంధించిన దానిని ఆధ్యాత్మిక శాస్త్రం అంటారు
ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ కూడా నిశ్చలమవుతుంది
ఆత్మకు అన్నీ తెలుసు, కానీ దాని గురించి ఎవరికీ ఏమీ తెలియదు
ఆత్మ అందరినీ చూస్తుంది.... దానిని ఎవ్వరూ చూడలేరు
ఆత్మ స్థితికి చేరితేనే ఆత్మానుభూతి కలుగుతుంది
ఆత్మ నుండి అనాత్మ ఆవిర్భవించి తిరిగి ఆత్మలోనికి కలిసిపోతుంది
ఆత్మ నుండి అణాత్మను వేరు చేయడం సాధ్యం కాదు
ఆత్మ లేనిదే విశ్వానికి ఎటువంటి ఉనికి ఉండదు
ఆత్మస్థితికి చేరితేనే అది అనుభవం లోనికి వస్తుంది
ఆత్మకు ఎటువంటి సమాచారం ఉండదు
ఆత్మ ఘనీభవనం చెందితే ప్రాణశక్తి ఏర్పడుతుంది
ఆత్మ అనేది ఒక జీవికే పరిమితమైతే అది "జీవాత్మ" అవుతుంది
ఆత్మ అనేది విశ్వమంతా వ్యాపించినట్లయితే అది "పరమాత్మ” అవుతుంది
ఆత్మను సాక్షాత్కారం గావించుకోవడం బహు కష్టతరం
ఆత్మను ఎక్కడ వెతకవలసిన అవసరం ఉండదు, అది నీలోనే ఉన్నది
ఆత్మ ఒకవైపు సంకల్పంగా మరొకవైపు పదార్థంగా మారుతుంది
ఆత్మకు ఆధారం లేకపోయినా అత్యంత శక్తివంతంగా ఉంటుంది
ఆత్మ అనేది అందరి అంతరంగంలోనే ఉంటుంది
ఆత్మ అనాత్మగా మారనంతవరకు స్వచ్ఛంగా ఉంటుంది
ఆత్మ లేనిది జీవకోటికి ఎటువంటి ఉనికి ఉండదు
ఆత్మను అనుభవంలోనికి పొందిన వారే "సిద్ధ పురుషులు"
ఆత్మను బహిర్గతం చేసినవారే "ఋషిపుంగవులు"
ఆత్మ దృష్టికి చేరిన వారే ఆత్మను అనుభవించగలుగుతారు
ఆత్మను కూడా దాటి వెళ్ళగలిగితేనే ఆత్మస్థితికి చేరుతాం
ఆత్మను అనుభవించడమే గాని నిరూపించడం సాధ్యం కాదు
ఆత్మను ఎరిగిన వారికి సర్వము అవగాహన అవుతుంది
ఆత్మను బహిర్గతం చేయగలిగింది మానవుడు మాత్రమే
ఆత్మ అంతరంగంలోనే ఉన్నది అని తెలుసుకోవడమే "అంతర్ముఖం"
ఆత్మ విద్యలో ఆరితేరితే జీవితం ఆనందమయం అవుతుంది
ఆత్మను "క్షేత్రజ్ఞుడు" అనుకుంటే అనాత్మ అంతా "క్షేత్రం" అవుతుంది
ఆత్మ అనాత్మలను కలిపి చూడగలగడమే పరిపూర్ణత్వం
ఆత్మ కోసం అన్వేషణ చేయడమే అజ్ఞానం, అపరిపక్వత
ఆత్మలో అనాత్మ ఉండదు కానీ ఆత్మ అనాత్మలో ఉంటుంది
ఆత్మను అనాత్మ నుండి వేరు చేయడమే ద్వైత్వమవుతుంది
ఆత్మ దేహమంతట పైనుండి క్రిందికి వ్యాపించి ఉంటుంది
ఆత్మస్థితికి చేరిన వారే పరమానందాన్ని పొందగలుగుతారు
ఆత్మ మినహా విశ్వములో మరొకటి లేనేలేదు
ఆత్మ స్థితి నుండి విశ్వాన్ని దర్శిస్తే ఆత్మదర్శనమవుతుంది
ఆత్మ ఘనీభవనo చెంది భౌతిక జగత్తుగా రూపాంతరం చెందుతుంది
ఆత్మను అంతరంగంలోని గుర్తించగలిగితే సంస్కారం శుద్ధి జరుగుతుంది
ఆత్మ అంతటా ఉన్నందువలన ప్రత్యేకంగా వెతకడం అజ్ఞానమే
ఆత్మను అంతట గుర్తించిన ప్రతి వ్యక్తి పరిపూర్ణుడవుతాడు
ఆత్మను బయట వెతికే వారంతా పరధ్యానాన్ని పెంచుకుంటారు
ఆత్మయే విశ్వం అనుకుంటే ఇక సాధన ముగిసినట్లే
ఆత్మ అనేది భాషకు అందదు. వర్ణనకు సాధ్యం కాదు
....... సర్వేజనా సుఖినోభవంతు..
****ఓం శాంతి శాంతి శాంతిః ****