
సన్యాసుల సంబరం
ఆధ్యాత్మిక అంబరం
సనాతన వైభవం
నీ ఆటే... కుంభమేళ పరిమళం
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ఎపుడో సాగరమథనం జరిగెనంట
అందున నాలుగు చుక్కలు నేలకు జారెనంట
ఆ అమృత చుక్కలు పడ్డ చోటే ఇప్పుడు
ఆకాశపు చుక్కలు మించిన భక్తులంట
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
ప్రపంచం ముక్కున వేలేసుకుని
చూస్తున్నదయ్యా
ముక్కంటిని కొలిచే మునులు
సంగమంలో వేస్తున్న మునకను
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
జారిపడిన అమృతపు చుక్కకే
కుంభమేళనా...
గొంతులో పడిన విషపు చుక్కకు
విశిష్ట పూజ లేదా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
దేవతలు అసురులు
అమృతం చిలికెనంట
విష్ణువు ఆ అమృతం పంచెనంట
పంచె అమృత చుక్కలు రాలిన చోట
కుంభమేళా జరిగెనంట
కుంభమేళకు వచ్చిన జనులు హరహర మహదేవ అని నిన్ను కొలిచెదరంట
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
నీ జట నుంచి జారిగ గంగలో
నీ భక్తులు మునిగే దృశ్యం
నీ శిగనున్న చంద్రుడి పైనుంచి కూడా కనబడుతున్నదయ్య....
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
అధర్మాన్ని అంతం చేయా
భోడి గుండు శంకరులుగా వచ్చి
ముష్కర మతాలకు గుండు చేయా
అఖాడాల ఆధ్యాత్మిక దండును సృష్టిస్తివా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
సంసారపు కుంభంలో చిక్కి
కుంభమేళకు వెళ్ళలేక వేదన పడుతున్న నాకు
ఆన్లైన్ అద్దంతో అక్కడి దృశ్యాలను చూపించి
నన్ను పులకింపజేస్తివా
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
అది కాలం తెచ్చిన మహా కుంభమేళా...
విశ్వం విస్మయమై చూస్తున్నది ప్రయాగ కళా...
అందులో అఖడాల అసామాన్య విద్య ప్రదర్శనలు భళా...
ఇదంతా నీ ఆటలో భాగమే కదా
అడిగింది ఇచ్చే ఆది శంకర భోళా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...
కుంభమేళా సాక్షిగా
నీటిపై తెలుతూ కొందరు
గాలిలో నిలబడుతూ కొందరు
నిప్పులో కూర్చుంటూ కొందరు
నేలలో దాక్కుంటూ కొందరు
చిత్రమైన ఆటలు ఆడుతున్నరయ్య...
నీ భక్తులకు నీ వాసనే తగిలింది కదా...
నీ ఆటకు నీవేసాటి భళా సదాశివా...