అవే ముఖ్యం
- పారనంది శాంతకుమారి
మంచం కన్నా పరుపు కొంచెం కురచైతే ఏం?
బొంత వేసి ఆ ఖాళీని పూరించవచ్చు.
భర్త కన్నా భార్య కొంత అందం తక్కువుంటే ఏం?
ఆమె హృదయాన్ని చూసి ప్రేమించవచ్చు.
తలగడలు ఎత్తుపల్లాలుగా తోచితే ఏం?
విప్పి వాటిని సరిచేసుకోవచ్చు.
మనుగడ ఎగుడుదిగుడులుగా నడచితే ఏం?
మనసును మార్చి సరి చూసుకోవచ్చు.
దుప్పట్లు చిరిగితేనేం? కుట్టుకొని వాడవచ్చు
ఇక్కట్లు పెరిగితేనేం? ఎలానో నెట్టుకొని గడపచ్చు.
అసౌకర్యాలుండటం శాపం కాదు,
వాటితో సర్దుకుపోవటం లోపంకాదు,
ప్రాప్తాన్ని అనుసరించటం పాపంకాదు.
నీలో నీతి తడబడితేనే నష్టం!
లోలోపలి నిజాయితీ కొరవడితేనే కష్టం!
చాలా బాగుంది