నేడు
ఆమె
పక పక
నవ్వుతూ
పరిమళిస్తున్నది
అతను
బురదనీరైన
తనకు
కాస్త
చోటిచ్చాడని
ఆమె
కొమ్మై
రాలిపోతున్నది
అతను
అనుమానపు
గొడ్డలై
కొడుతుంటే
ఆమెలో
ఏ తుఫాను
చెలరేగిందో
కంటిరెప్పల
చెలియలికట్టను
దాటి
చెంపతడిమింది
ఆవేదన
అతనేమో
సుడిగుండమై
తిరుగుతూనే
ఉన్నాడు
అతను
తన జీవితంలో
ఎన్ని
ముడతలు
ఏర్పడిన
దిగులుచెందడు
ఎందుకంటే
ఆమె
ఓ ఇస్త్రీపెట్టె మరి
కుటుంబానికి
వెలుగునిచ్చే
దీపం
ఆమె
ఆ దీపంలో
నూనెగా
కరిగిపోయే
రూపం
అతను
మజ్జిగెందుకు
త్రాగలేదని
మండుటెండలకు
పోటిపడుతూ
తగాదాకు
దిగిందామె
నాకిష్టం
లేదని
చల్లని కుండలో
నీటితో పోటీ పడుతూ
చెప్పాడతను
ఆమె
అతడిని
చదువుతుంది
అతడు
ఆమెను
చదువుతాడు
వారివురిని
సమాజం
చదువుతుంది
ఎప్పుడూ
ఆయనను
సంతోషపెట్టాలనే
ఆమె శ్రమకు
కొలమానం
*మే* ఒకటి
ఎప్పుడూ
ఆమెను
నవ్వించాలనే
అతని
తుంటరితనానికి
కొలమానం
*ఏప్రిల్* ఒకటి
ఆమె
పువ్వై
నవ్వుతూ
ప్రేమను
పరిమళిస్తున్నది
అతనో
మంచినీటి
సరస్సు కనుక