ఆమె
పరిమళించే
పూలతోటే
అతని తీరే
నిత్యం జరిగే
అనుమానపు వేట
కనుకే
ఆ సంసారం
దిగులుమేఘాలలో స్నేహం చేసే
ముళ్ళబాట
ఆమె మనసు
ముళ్ల తీగలా మారిందని
కళ్ళ నీళ్ళు తెలిపినా
అతను
అనుమాన కుళ్ళు నిండిన ఒళ్ళుతో
మాటల కొరడాలు పేనుతూనే ఉన్నాడు
ఆమె
ఎప్పుడూ
ఆకులు రాలిన చెట్టే
అతను
అనుమానపు
పెనుగాలి మరి
ఆమె
కళ్ళు దిగులుమేఘాలై
ఉప్పునీటి
వర్షాన్ని కురిపిస్తున్నాయి
తన పసుపు కొమ్మును
తను రాళ్ళెత్తినా భవనమే
తినేయడంతో
కమ్మనైన కవితకు
భావుకత రత్నాలను
అలంకరించే
పద సంపద మీలో ఉందన్నదామె
ఆ సంపదను
ఎక్కడ దొంగలెత్తుకెళ్ళుతారో
నా మది గదికి తాళం కూడా లేదు
భయంగా ఉందన్నాడతను
అతని చమత్కారానికి
కవితా పుష్పమై
భావుకత పరిమళమై
కదిలిందామె
సంసారపు తీగకు
పూసిన పువ్వులే
అతను ఆమె
ఒకరినొకరు అర్థం చేసుకున్నారో
కాయలై పళ్ళై పండుతారు
అర్థం చేసుకోలేరో
పువ్వులు గానే రాలిపోతారు
అతను ఆమె
కష్టనష్టాలను ఓర్చి
బ్రతుకును విజయదశమిగా
మార్చుకున్నారు
కానీ
పాలపిట్టలు లేని లోటే
వేదనపామై
ఆ మనసుల్లో బుసకొడుతున్నది పాపం