అడవివాసి అయ్యాడు
పల్లె వాసిగా. అటుపై
వచ్చాడు పట్టణానికి
ఆపై నింగిలో నివాసం
నగరంలో జీవనము
కష్ట సుఖాల సంగమం
చదువులలో మెరుగు
నగర జీవన దశ
పల్లెల్లో పుట్టిన వారు
నేడు ప్రపంచం చూశారు
అభివృద్ధి అందిస్తోంది
నగర జీవన దశ
మనీసి కోరేది సౌఖ్యం
ఇస్తుంది దాన్ని నగరం
పట్టణంలో పనులుండు
తరలి వస్తారు జనం
పల్లెలో పనులు స్వల్పం
చదువుకు వీలే లేదు
నగర కష్టాలు ఎన్నైనా
తరలి వస్తారు జనం
నేటి రాజకీయాలబ్బో
నోటికి వచ్చిందే మాట
తా చేసేదీ మంచిదని
ఫోజులోకటి పైపెచ్చు.
ప్రజలకు జ్ఞానముంది
కాబట్టి సరిపోయింది.
లేకుంటే దేశం బూడిదే
ఫోజులొకటి పైపెచ్చు
ప్రభుత్వం పటిష్టమై
పాలన బాగున్నప్పుడు
నగరాలు అందరికీ
నప్పుతాయి నాణ్యతలో
ప్రజలంతా బాధ్యతగా
శుభ్రతను పాటించాలి
అంతా కలిస్తే నగరం
నచ్చుతుంది నాణ్యతలో
అష్టాక్షరీ నేర్పితిరి
ఇష్టమైనది మాకంతా
శంకర ప్రియ మాష్టారూ
ఆర్యా! మీకు వందనాలు
*****
(ఇది 8 అక్షరాలు ఒక పంక్తి, 4పంక్తుల మకుటం.)
రూపకర్త. శ్రీ శివ శంకరప్రియ గారు