"అమ్మామృతం"
- డా॥యం. శ్రీరామి రెడ్డి
పల్లవి:
అమ్మ మాటయే అందరి నోట తొలి మాట
అమ్మ పాటయే అన్నిటి కంటే తియ్యటి పాట॥అమ్మ
అనుపల్లవి:
రాముడు కృష్ఞుడు ఈసుడు వ్యాసుడు -
దేవుళ్ళయిన మహాత్ములకు జగన్మాత యే జనని
భగవానల్లా భావ స్వరూపమునకు
భవ బంధనమే బాంధవ్యపు బాట ॥ అమ్మ
చరణం -1:
ఆకలి వేళల అన్నప్రసాదం అమ్మ
అస్వస్థతలో దివ్యౌషధము అమ్మ
భయాందోళనలో కంఠస్వరము అమ్మ
విషాద వేళల నిషృతి దోహదమే అమ్మ
కన్నీరొలికే శోక సంద్రమున ఒడ్డుకు చేర్చే ఓదార్పే అమ్మ ॥అమ్మ
చరణం-2:
నవమాసాలు కడుపున దాచిన అమ్మ
బ్రూణావయాలకు అణువుల కూర్చిన అమ్మ
జఢత్వానికి జవసత్వాన్నొసగిన అమ్మ
భవితవ్యానికి భవరూపం పొదిగిన అమ్మ ॥ అమ్మ
చరణం-3
ప్రాణానికి ప్రాణం పణంగ పెట్టి ప్రసవించిన అమ్మ
నడిచే దాక చను బాల నైవేధ్యాన్నందించిన అమ్మ
ప్రాణం పోయేవరకు పరమాతి ప్రేమను పంచిన అమ్మ
ప్రత్యక్ష దైవమై ప్రతిక్షణము అభయాన్నిచ్చిన అమ్మ ... అమ్మ॥