

అగాథం నుండి..ఆకాశపు అంచులదాకా..
మా ఇంటికొస్తే నాకేం తెస్తావు...
మీ ఇంటికొస్తే నాకేమిస్తావు...
అని కాక ఇవ్వడమే తప్ప
పుచ్చుకోవడం ఎరుగకపోవడమే
"మంచితనం...మానవత్వం"...
నిర్భాగ్యులను
నిస్సహాయులను మోసం చేసి
అన్యాయంగా అక్రమంగా
దోచుకుని దాచుకోవడమే..."దానవత్వం"...
కష్టాలలో చిక్కుకున్న వారి
కన్నీరును తుడిచి
ఆపదలో ఉన్న వారిని ఆదుకుని
తమకు ఉన్నంతలో ఇతరులకు
పెట్టాలని తపించే ప్రేమామయులు
నేడు ఇష్టపూర్వకంగా పేదలకిచ్చి
రేపు పరమాత్మ నుండి పుష్కలంగా పుచ్చుకోవడమే..."దాతృత్వం"...
కుల మతాలకతీతంగా ధనిక పేద
తారతమ్యాలు లేకుండా ఎవరికి
ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పందించి
సహాయమందించడమే.."దైవత్వం"
కష్టజీవుల కష్టాలను తొలిగించడం
వారిలో చైతన్య జ్వాలల్ని రగిలించడం
వారి బానిస బ్రతుకులపై వారికి
కనువిప్పు కలిగించేదే..."కవిత్వం"...