Menu Close
Kadambam Page Title
దుఃఖ శిఖరం
-- గవిడి శ్రీనివాస్

వెలిగిన తలపుల్లో
ఊపిరి నలిగి పోతుంది.

శిఖరపు అంచుల్లో
వేలాడే ఆలోచనలు
ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.

నిద్రపోని భావాలు
నిప్పు కణికల ఉప్పెనవుతాయి.

కొన్నినాళ్ళు ప్రపంచమే
కొద్ది కొద్దిగా కుదుపుతుంది
ఉహలకే సంకెళ్లు బిగిస్తుంది.

కరిగిపోతున్న కాలాన్ని
తడుపుతున్న వర్తమానం
గాయమై తడుతుంది.

ఊహల చిల్లుల నావ
దుఃఖ సముద్రాన్నీదుకుంటూ
శిఖరాల కొసలకి
ఉద్వేగపు అడుగులు జరుపుతుంటాయి.

Posted in June 2020, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *