Skip to content
కావలసినవి:
- కందిపప్పు - ఒక కప్పు
- పచ్చి కొబ్బరి ముక్కలు (సుమారుగా ఒక చిప్ప) – అర కప్పు
- ఎండుమిర్చి – పది
- వెల్లుల్లి పాయలు – రెండు లేదా మూడు
- చింతపండు గుజ్జు – ఒక టీ స్పూను
- జీలకర్ర – ఒక టీ స్పూను
- ఉప్పు తగినంత
చేయు పద్దతి:
- కందిపప్పు + ఎండుమిర్చి రెండింటినీ నూనె లేకుండా వేరు వేరుగా వేయించుకొని, ఒక ప్లేటులో వేసి ఆరనివ్వాలి.
- మిక్సీ జార్ లో వేయించి పెట్టుకొన్న కందిపప్పు, ఎండుమిర్చి లను వేసి, అందులోనే వెల్లుల్లి పాయలు, ఉప్పు మరియు కొద్దిగా నీరు వేసి మెత్తగా ఆడించుకోవాలి.
- తర్వాత, కొబ్బరి ముక్కలు, చింతపండు గుజ్జు లను అందులో వేసి మరల మిక్సీ ఆడించుకోవాలి.
- అంతే!! ఘుమఘుమలాడే రుచికరమైన పచ్చడి రెడీ!! మీకు ఇష్టమైతే ఈ పచ్చడి పై పోపు వేసుకొని కలుపుకొనవచ్చును.
- వేడి వేడి అన్నంలో ఈ పచ్చడిని కాస్త నెయ్యితో కలుపుకొని తింటే...... ఆహా ఏమి రుచి.... అనక మానరు!!
622
the chetiny is verytateful