Menu Close
Kadambam Page Title

నీ జ్ఞాపకంగా రాలుతూ ..!

- గవిడి శ్రీనివాస్

నీ జ్ఞాపకాల్ని మోస్తూ
నీతో కలిసి తిరిగిన
ఈ ఇసుక తీరాల వెంట పొడి పొడి గా రాలిపోతున్నాను.

ఈ ఇసుకలోఈతచెట్లు నన్నే ప్రశ్నిస్తున్నాయి
నీ వెంట వెన్నెలలా నడిచే తోడేదనీ.

నీవు ఇక రాలేవు
నేను నీ జ్ఞాపకాల నుండీ పోలేను.

ఆకాశంఒడ్డున రాలిన నక్షత్రాలన్నీ నీవే
ఏరుకోడానికేయుగాలు చాలవు.

మైదనాల వెంటమబ్బులవెంట
అడవి దారుల వెంట తిరిగినా
రాలిపోయినవి తిరిగి బతికిరావు.

సమకూర్చుకోడానికే
సమయాలు కలిసి లేవు.

గాలి ఎప్పటిలానే రెక్కలు కట్టుకు ఊగుతోంది
ఎండిన ఆకుల్లో నిండిన అనుభవాలు వాలుతున్నాయి.

దిగులు గా ఆకాశం గుంకుతోంది
మబ్బులేమో చీకటి తెరల్నికప్పుతున్నాయి.

కన్నీటి నదుల వెంట కాలం జారిపోతుంటే
ఆ ఒడ్డున
నీ అనేక జ్ఞాపకాలు గా రాలుతూ
మిగిలిన ఒంటరి చెట్టుగా నేను.

Posted in May 2019, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *