Menu Close
Kadambam Page Title
అహం బ్రహ్మాస్మి
గాంధీజీ యలమంచిలి

ఊహాతీతపు అంచులు దాటి
విశ్వరహస్యం మేధను దాచిన
ప్రకృతిలో పరమాణువును నేను
పరిణామంలో శిశువును నేను

పదార్ధానికి పరమార్ధం నేనే
కాలానికి విలువను నేనే
ప్రతిరోజుకు రేపును నేనే
రోదశి మధ్యన రోహిణి నేనే

గతితార్కిక భౌతికవాదం నాది
శృతి కలిపిన శాస్త్రజ్ఞానం నాది
అనునిత్యం తత్వ విచారణ నాది
నవజీవన నాడీ స్పందన నాది.

తప్పటడుగుల నిన్నటి నైనా
నవతకు సమతకు వేకువ నేనై
మానవ ప్రగతికి నడకను నేనై
భావి తరాలకు నిలకడ నైనా

2022 లో అణు సంధాన ప్రక్రియతో (nuclear fusion)
మానవజాతి అనంత శక్తిని శాసించే దశలో ఉందనే ప్రేరణతో వ్రాసిన వచన కవిత

********

Posted in February 2026, కవితలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *