Menu Close
మనోల్లాస గేయం
మధు బుడమగుంట

పెదవి దాటని మాటొకటుంది

యుక్తవయసులో ఉన్న ఇరువురు ప్రేమికుల మధ్యన జనించే ప్రేమ మొగ్గలు తొడిగి చిగురించి పుష్పించే తరుణంలో వారి మనసులో జనించే చిలిపి ఊహలకు ఒకరిమీద ఒకరికి కలుగుతున్న ప్రేమపూరిత ఆరాధనను చక్కటి మాటలతో ఒక పాటగా మలిచి మన సిరివెన్నెల గారు అందించారు. ఈ Valentine’s Day సంచికలో ఈ పాట చక్కగా నప్పుతుందనే భావనతో మీకు అందిస్తున్నాము. రమణగోగుల గారు ఒక వినూత్నమైన గాత్ర సంపదను కలిగి తనే ఈ పాటకు స్వరకల్పన కూడా చేయడం పాటకు మరింత వన్నెను చేకూర్చింది.

చిత్రం: తమ్ముడు (1999); సంగీతం: రమణ గోగుల; రచన: సిరివెన్నెల; గానం: రమణ గోగుల, సునీత

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
అడగరానిది ఏమిటి ఉంది తెలుపవా సరిగా
మనసు చాటున ఎందుకు ఉంది తెరలు తీయ్ త్వరగా

మనసు నిన్నే తలచుకుంటోంది
వినపడదా దాని గొడవ
తలుచుకుని అలసిపోతోందా
కలుసుకునే చొరవ లేదా
ఇబ్బందిపడి ఎన్నాళ్లిలా ఎలాగ మరి
అందాల సిరి ఒళ్లో ఇలా వచ్చేస్తే సరి

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా

ఇదిగిదిగో కళ్లలో చూడు
కనపడదా ఎవ్వరున్నారు
ఎవరెవరో ఎందుకుంటారు
నీ వరుడే నవ్వుతున్నాడు
ఉండాలి నువ్వు నూరేళ్లిలా చిలిపి కలా
బాగుంది గాని నీ కోరిక కలైతే ఎలా

పెదవి దాటని మాటొకటుంది తెలుసుకో సరిగా
అడుగుతావని ఆశగ ఉంది అడగవేం త్వరగా
హే కోయిలా.. ఓ కోయిలా..
హే కోయిలా.. ఓ కోయిలా..

********

Posted in February 2026, పాటలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *