Menu Close
sravanthi_plain
Ayyagari-Suryanarayana-Moorthy
దసరాపండువు
అయ్యగారి సూర్యనారాయణమూర్తి
ఆ.వె. నవశతాక్షిపండు(1) వవలీల భక్తుల
        విజయదశకు నాంది, విజయదశమి
        మంచి, దుస్స్వభావమహిషాసురుల పైన
        గెలుపు తెలుపు, నిలుపు విలువ లెపుడు
              (1) నవరాత్రుల/నవ దేవీ అవతారముల, పండువు

తరలి [లక్షణము భ-స-న-జ-న-ర 11 యతి]
        దేవి వివిధరూపములను దీవనల నొసంగఁగన్ 
        భావి శుభవిభాకరముగ భాసిలఁగ నివాసముల్
        తావు లగు ముదంబునకు, విలాసములకు, నొక్కచోఁ
        బ్రోవుగను(1) సుఖింప గలుగు రోజు లివియె రండహో! 
              (1) సముహముగా

కం. మురువగు నదనపు భృతులకు
      ధరలను దగ్గింపులకును దగురీతిని సం
      బరములకు నూత్నవస్తువు
      లరుదగు సమ్మేళనముల కండయె దసరా

కం. దసరాలోనే సరదా
      ముసిముసి నవ్వులను రువ్వి ముసుఁగున మసలున్
      మిసమిస లాడఁగఁ జేయును
      బసిముసలియు వయసువారిఁ బస నొసఁగి వెసన్
Posted in October 2025, సాహిత్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *